స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతుంది. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ లైన్ వైరల్ గా మారిన సినిమాలో సుకుమార్ చాలా సర్ ప్రైజులు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బన్నీ పుష్పతో అంతకుమించి అనిపించేలా ఈ సినిమా అదిరిపోతుందని అంటున్నారు. ఆల్రెడీ రంగస్థలంతో తన సత్తా ఏంటో చూపించిన సుకుమార్ పుష్పతో మరోసారి రికార్డుల మీద కన్నేశాడు.

ఈ సినిమాతో బన్నీని నేషనల్ వైడ్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకునేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకు పర్ఫెక్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే అదదరగొట్టేలా ఉంటాయట. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తాడని టాక్. ఈ సినిమా తర్వాత బన్నీ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 2022లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని టాక్.  పుష్ప సినిమా మాత్రం వచ్చే ఏడాది మిడిల్ లో రిలీజ్ చేసేలా చూస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించే పుష్ప సినిమా మ్యూజిక్ పరంగా కూడా వారెవా అనిపించేలా ఉంటుందని టాక్.                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: