మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. చిరు సినిమాలో చరణ్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. కొరటాల శివ చిరుతో ఈక్వల్ గా చరణ్ రోల్ రాసుకున్నాడట.

ఇక ఈ సినిమాలో చరణ్ తో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. మొన్నటివరకు ఈ సినిమాలో చరణ్ తో రొమాన్స్ చేసేది కన్నడ భామ రష్మిక మందన్న అని అన్నారు. అయితే చరణ్ పక్కన ఎవరు నటిస్తారన్న విషయంపై త్వరలో అఫీషియల్ అప్డెట్ వస్తుంది. రాం చరణ్ రొమాన్స్ చేసే భామ ఎవరన్నది త్వరలో రివీల్ చేస్తుంది.

ఆచార్య నుండి రాబోతున్న ఈ క్రేజీ అప్డేట్ పై మెగా ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. చరణ్ పాత్ర కూడా 30 నిమిషాలు అదరగొడుతుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆచార్యలో కూడా చరణ్ అదరగొట్టేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో రాం చరణ్ సోలో సినిమా ఉంటుందని తెలుస్తుంది. చరణ్ తన సినిమాల లైనప్ తో సెన్సేషనల్ హిట్ కొడతాడని తెలుస్తుంది. రాం చరణ్ తన నెక్స్ట్ సినిమాల కోసం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ ఎలాగు నేషనల్ వైడ్ గా అదరగొడుతుంది ఆ తర్వాత ఆచార్య మాత్రం తెలుగులో సందడి చేస్తుంది.                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: