ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..అసలు బిగ్ బాస్ సీజన్ 4 బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం అభి, మోనాల్, అఖిల్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. ఈ స్టోరీ వల్లే ఎక్కువ మండి బిగ్ బాస్ చూస్తున్నారు. నిజానికి అభి, అఖిల్ మినహాయించి మోనాల్ పెద్ద స్ట్రాంగ్ హౌస్ మేట్ ఏమి కాదు. ఆమెకి ఓట్స్ కూడా చాలా తక్కువ పడుతున్నాయి. కాని బిగ్ బాస్ ఎదో రకంగా రాజకీయం చేసి ఆమెని హౌస్ నుంచి బయటికి వెళ్లనీయడం లేదు. ఎందుకంటే ఆమె పోతే బిగ్ బాస్ షో అంత ఆసక్తిగా ఉండదు. ఎందుకంటే ఆమె వల్లే ఎక్కువ గొడవలు వస్తుండడం తో టీ ఆర్ పి కోసం నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యం ఆమెని సేవ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పలు రకాలుగా గుస గుస లు వినిపిస్తున్నాయి.ఇక తాజగా ఎలిమినేట్ అయిన లాస్య వీళ్ళ ముగ్గురి లవ్ స్టోరీ గురించి ఈ విధంగా స్పందించింది.

లాస్య మాటల్లో.... "అఖిజిత్-అఖిల్-మోనాల్ లవ్ ట్రాక్ గురించి చెప్పాలంటే.. అభి సైడ్ నుంచి లేదు. 5 వారం నుంచి మోనాల్‌తో ఆ ఫ్రెండ్ షిప్‌ని కూడా వద్దనుకున్నాడు. నిజానికి మాట్లాడమని మేమే చెప్పేవాళ్లం.. అయితే అభిజిత్ వైపు నుంచి ట్రై యాంగిల్ అని ఎప్పుడూ అనిపించలేదు. బయట నుంచి చూసేవాళ్లకి ఎలా అర్థమైందో తెలియదు.అయితే అఖిల్-మోనాల్‌లు కూడా ట్రూ ఫ్రెండ్స్ అనే చెప్తున్నారు. కానీ బయట నుంచి చూసేవాళ్లకి లవ్ ట్రాక్‌లా ఉందని చెప్తున్నారు. నాకు అభిజిత్ ఫ్రెండ్ కాబట్టి.. అతని పాయింట్ ఆఫ్ వ్యూ‌లో అలాంటిది లేదని అనిపించింది.


అఖిల్‌-మోనాల్ మధ్య ఉందా? అంటే నేను చెప్పలేను.మోనాల్‌ని బయటకు పంపించేస్తే ఆటలో కిక్ ఉండదు.. అందుకే ఆమెను ఎలిమినేట్ చేయకుండా ఉంచుతున్నారంటే.. ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇలా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ.. నిజం ఏంటన్నది మనకి తెలియదు.బయటకి చాలా రకాలుగా అనుకుంటున్నారు.మోనాల్-అఖిల్‌ల మధ్య ఏం ఉందో చెప్పలేదు.. కానీ హౌస్‌లో నాకు అనిపించింది ఏంటంటే.. క్లోజ్ ఫ్రెండ్స్‌లాగే ఉండేవారు. మోనాల్ కూడా అఖిల్ తనకి బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పేది.


వాళ్లిద్దరి మధ్య లవ్ ఉందని వాళ్ల నోటి నుంచి రాలేదు. అలాంటప్పుడు మేం ఎందుకు అనుకుంటాం. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అంటే ఇద్దరి ఫ్రెండ్స్ క్లోజ్‌గా ఉండకూడదా?? వాళ్లిద్దరికీ అలా కుదిరింది. కొన్ని మెంటాలిటీలు కొందరికి మాత్రమే ట్యూన్ అవుతారు. నేను, అభి, నోయల్, హారికలు ట్యూన్ అయ్యాం. అఖిల్-మోనాల్ కూడా అలాగే ట్యూన్ అయ్యారు. నేనైతే వాళ్లని బెస్ట్ ఫ్రెండ్స్ అనే అంటాను. వాళ్ల మధ్య ఏమైందో నాకైతే తెలియదు.. నేను ఎపిసోడ్స్ ఏం చూడలేదు. హౌస్‌లోపల ఉండి నేను చూసింది ఇదే" అంటూ అభి-అఖిల్-మోనాల్ లవ్ ట్రాక్‌పై క్లారిటీ ఇచ్చింది లాస్య.ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: