అప్పుడెప్పుడో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా ను బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.. వివి వినాయక్ దర్శకుడు.. బెల్లంకొండ శ్రీనివాస్ ని టాలీవుడ్ లో లాంచ్ చేసిన అదే దర్శకుడు బాలీవుడ్ లోనూ లాంచ్ చేయడం విశేషం..ఈ సినిమాకి దర్శకత్వం చేయమని బెల్లంకొండ మొదట్లో పలువురి దర్శకులను రిక్వెస్ట్ చేయగా ఎట్టకేలకు వినాయక్ ఈ ఈ సినిమా ని ఒప్పుకున్నాడు..‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హిందీలో తీస్తాడని ముందు వార్తలొచ్చాయి. కానీ అది చివరికి వినాయక్ చేతికి చిక్కింది..

 తెలుగులో ఇంకా హీరోగా అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోని బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవడ్ కి వెళ్లడం రిస్క్ అని చెప్పాలి. ‘అల్లుడు శీను’తో తెలుగులో హీరోగా అరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ వరుస ఫ్లాప్ లతోనే నెట్టుకొస్తున్నారు.. ఈ హీరో కి గట్టిగ హిట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే ఈసినిమా ని చెప్పలేం..జయ జానకి నాయక, సాక్ష్యం రాక్షసుడు పర్వాలేదనిపించాయి.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ అనే చిత్రం లో నటిస్తున్నాడు. న‌భా న‌టేష్‌, అను ఎమ్మాన్యుయేల్, రాయ్‌ల‌క్ష్మీ,  సోనూ సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.నిర్మాణ సంస్థ సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గొర్రేల సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో సెటిల్ అయ్యే పనిలో ఉండక బాలీవుడ్ కి ఎందుకని కొంతమంది సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు..చేస్తే  చేశాడు  కానీ ఛత్రపతి లాంటి క్లాసిక్ సినిమా ని చేయడమేంటి అని అంటున్నారు.. ఇటు శ్రీనివాస్ కి, అటు వినాయక్ కి ఇద్దరికీ ఈ సినిమా ని హ్యాండిల్ చేసే సత్తా లేదన్నది వారి విమర్శ.. మరీ వీరిద్దరూ వారి వారి పాత్రలకు న్యాయం చేస్తారా అన్నది చూడాలి. ఈ సినిమా తో ఇప్పుడు వినాయక్ తో పాటు రచయిత విజయేంద్రప్రసాద్ కలిసి వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు రాజమౌళి స్థాయిలో సినిమాకు న్యాయం చేయగలడా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొంత కాలంగా వినాయక్ వరుస అపజయలతో సతమతవుతున్నాడు. అవకశాలు కూడా రావడం లేదు. అయితే రీమేక్ కథలకు న్యాయం చేయగలడనే గుర్తింపు ఉంది. మరి వినాయక్ ఏ విధంగా న్యాయం చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: