టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న కన్నడ భామ పూజ హెగ్డే ఇప్పుడు ఇతర భాషల్లో కూడా మరింత పాపులారిటీ తెచ్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఆమె టాలీవుడ్ సహా బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు ఒప్పుకొని బిజీగా ఉంది. అయినా సరే ఎక్కడా తగ్గకుండా ఇతర భాషల్లో ఏమైనా అవకాశాలు వస్తాయా అని ఎదురు చూసే పనిలో పడింది. అయితే ఆమె తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది అని వార్తలు గట్టిగా వినిపించాయి ఈ విషయం మీద ఈ యూనిట్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోయినా ఆమె ఇందులో నటిస్తోందని అంటున్నారు. అంతే కాక రెండున్నర కోట్ల దాకా ఆమె రెమ్యునరేషన్ కూడా అడిగినట్టు సమాచారం. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం ఆమెను అప్రోచ్ అవ్వడం అయితే నిజంగానే జరిగిందట. కానీ ఈ సినిమాకి ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ విన్న నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు అంత ఇచ్చుకోలేమని తేల్చి చెప్పేశారట. ఈ సినిమా చేయాలంటే తాము చెప్పిన రెమ్యూనరేషన్ కుదురుతే ఒప్పుకోమని లేక పోతే మీకు అవకాశం ఇవ్వలేమని వాళ్ళిద్దరూ తేల్చిచెప్పడంతో పూజ ఇప్పుడు ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. నిజానికి పూజ ఆలోచన వేరే విధంగా ఉంది. ఈ సినిమా కనుక ఒప్పుకుంటే ఈ సినిమా ఎటూ ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది.

 కాబట్టి తమిళ మలయాళ భాషల్లో కూడా తన మార్కెట్ మరింత పెరుగుతుందని ఆమె భావించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా వాళ్ళు అంత ఇచ్చుకోలేమని షాక్ ఇవ్వడంతో ఇప్పుడు తన రేంజ్ తగ్గించుకుని తక్కువ రెమ్యునరేషన్ కే సినిమా చేయాలా లేకపోతే ఈ సినిమా వదిలేయాలా అనే మీమాంసలో పడిందట. ప్రస్తుతానికి ఈమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. అయినా గాని ఈ సినిమా చేస్తే క్రేజ్ వస్తుందని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ పడి పడి లేచే మనసు అందాల రాక్షసి వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన హను రాఘవపూడి తగ్గిస్తున్నాడు. అదీగాక పిరియాడిక్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమా మీద కాస్త ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: