షూటింగ్ సమయంలో డైరెక్టర్లు హీరోయిన్స్ పై చేయిచేసుకున్న సంఘటనలను గతంలో అనేక సార్లు విన్నాం. ఇదేంటి, ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తామేం తక్కువ కాదన్నట్టు డైరెక్టర్ పై చేయిచేసుకుంటున్నారా? అని అనుకుంటున్నారు కదూ. వెయిట్ వెయిట్. మీ డౌట్ ను ఇప్పుడే క్లారిఫై చేసేస్తాం. ఇదంతా జస్ట్ షూటింగ్ లో ఫన్ మాత్రం. హీరోయిన్ కీర్తి సురేష్ సహజంగానే తన కో స్టార్స్ తో అలాగే సినిమా యూనిట్ తో ఫ్రెండ్లీ ర్యాపొను షేర్ చేసుకుంటుంది. ఆ ర్యాపొలో భాగంగా జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.


 మరి వివరాల్లోకి వెళ్లిపోదామా? 

అప్కమింగ్ ఫిలిం "రంగ్ దే"లో నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ నితిన్ కు జోడీగా కనిపిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశానికి చెందిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కీర్తిసురేష్ షేర్ చేసింది. 


ఇందులో, కీర్తి సురేష్ డైరెక్టర్ వెంకీ అట్లూరిని ఓ గొడుగుతో కొట్టడానికి వెంటబడుతోంది. సరదాగా షూట్ చేసిన ఈ వీడియో కచ్చితంగా ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. షూటింగ్ టైం లో ఫన్ యాక్టివిటీస్ ను ఇలా ఆడియెన్స్ తో పంచుకుందికేరళ కుట్టి కీర్తి సురేష్.  ఈ పోస్ట్ లో కీర్తి నితిన్ ను కూడా ట్యాగ్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: