ఇంటర్నెట్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫాన్స్ కు అసలైన సంక్రాంతి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ టీజర్ వచ్చేసింది. అనుకున్నదానికంటే అద్భుతంగా, పవన్ కల్యాణ్ ను కొత్తగా ఎలివేట్ చేస్తూ టీజర్ మొత్తం సాగింది. మాస్ ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఈ టీజర్ లో పవన్ డైలాగ్స్ తో పాటు ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుంది. 


ఇక టీజర్.. ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాయర్ కోటు వేసుకోవ‌డంతో మొదలవుతుంది. మూసి ఉంచిన లా పుస్త‌కాల‌ క‌వ‌ర్‌ను తొల‌గించ‌డం, సీరియ‌స్‌గా కోర్టులో అబ్జ‌క్ష‌న్ యువ‌రాన‌ర్ అంటూ డైలాగ్ చెప్ప‌డం ఓ కొత్త పవర్ స్టార్ ను చూపిస్తున్నాయి. అలాగే త‌నని క‌త్తితో పొడ‌వ‌డానికి వ‌చ్చిన విల‌న్స్‌తో.. 'కోర్టులో వాదించ‌డం తెలుసు, కోటు తీసి కొట్ట‌డ‌మూ తెలుసు' అంటూ వారిని చిత‌క‌బాద‌డం వంటి మాస్ స‌న్నివేశాలు అభిమానులకు కిక్ ఎక్కించాయి.

 

బ్యాగ్రౌండ్ లో స‌త్య‌మేవ జ‌య‌తే.. అంటూ మ్యూజిక్ వినిపిస్తుంది. టీజ‌ర్ ప‌క్కా మాస్‌ను, పవన్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకునేలా ఉంది. త‌మ‌న్ త‌న‌దైన స్టైల్లో అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌ అందించాడు. టీజ‌ర్‌కే ఈ స్థాయిలో మ్యూజిక్ ఇస్తే ఇక సినిమా మాంతం ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అని అనుకుంటున్నారు అభిమానులు. టీజర్ ఊహించిన దానికంటే అద్భుతంగా ఉండడంతో ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు అనుకుంటున్నారు. 


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ప్రశాంత్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా ఎస్‌ఎస్‌ త‌మ‌న్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్‌ సమర్పిస్తుండగా..  దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: