చాలా గ్యాప్ ఇచ్చిన సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల జోరు కొనసాగుతోంది. అందులోనూ చాలా గ్యాప్ తర్వాత తెరచిన థియేటర్లు కూడా జనాలతో సందడి చేయడం మొదలు పెట్టాయి. కరోనా కారణంగా ఎవరూ థియేటర్ల మొహమే చూడరనుకున్న సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం కలిగించేలా చేశారు జనాలు. అందుకే థియేటర్లు మునపటిలా కళకళలాడుతున్నాయి. జనాల రకాతో కొత్త కళను సంతరించుకున్న థియేటర్లను చూసి తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులోనూ  సంక్రాంతికి పండుక కానుకగా వచ్చే సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
సకుటుంబ సమేతంగా వచ్చి సినిమాలను తిలకిస్తారు కాబట్టి సంక్రాంతి బరిలో తమ సినిమాలను దింపేందుకు స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అనుకున్నట్టుగానే ఈ సంక్రాంతి బరిలో టాలీవుడ్ సినిమాలు బాగానే పోటీ పడ్డాయి. కానీ అందులో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి.. ఏ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయో తెలుసుకోవాలంటే మాత్రం ఈ ఆర్టికల్ ను చదవాల్సిందే.. అయితే ఈ సినిమా పండుగలో మిక్స్ డ్ రిజల్ట్సే కనిపించాయి. టాలీవుడ్ నుంచి చాలా సినిమాలే రిలీజ్ అయినప్పటికీ అందులో మాస్ మాహారాజా రవితేజ‘క్రాక్’ సినిమా, ఎనర్జిటిక్ హీరో రామ్‘రెడ్’ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  

కానీ బెల్లంబాబు నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా మాత్రం డిజాస్టర్ అంటున్నారు ప్రేక్షకులు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ  సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక తుస్సుమన్నది. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన విజయ్‘మాస్టర్’ సినిమా కూడా నెగిటివ్ టాకే తెచ్చుకుంది. భారీ రేంజ్ లో కలెక్షన్లను కొల్లగొడతాయనుకున్న ఈ సినిమాలు తుస్సుమనడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాలపై ఫన్నీ మీమ్స్ పెడుతున్నారు. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ అన్న ట్యాగ్ ను మోసిన సినిమాలేంటో ఆడియెన్సే డిసైడ్ చేశారు. సో ఈ సారి సంక్రాంతి సినిమాలు ప్రేక్షకుల నుంచి పై విధమైన గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇక సమ్మర్ స్పెషల్ గా రాబోతున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి ఏ విధమైన టాక్ తెచ్చుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: