అనతికాలంలోనే గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆయన ఆఖరిసారిగా గద్దలకొండ గణేష్ సినిమా లో కనిపించారు. అయితే ఈ సినిమాకి వరుణ్ తేజ్ 7 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. తన తదుపరి సినిమాకి మాత్రం రెమ్యూనరేషన్ రేంజ్ అమాంతం పెంచేశారట. బాక్సింగ్ మూవీకి రూ. 8 కోట్ల పుచ్చుకుంటున్నారని.. అలాగే మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఎఫ్-3 మూవీకి 11 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

నిర్మాత దిల్ రాజు ఎఫ్-3 మూవీ ని 70 కోట్లతో నిర్మిస్తుండగా.. సగం బడ్జెట్ ని లీడ్ యాక్టర్లకే ఇస్తున్నారట. అయితే వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ రెండు సినిమాలు కూడా 2021 వేసవికాలంలో విడుదలవుతాయట. వరుణ్ తేజ్ యొక్క రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే మెగా అభిమానులు పండుగ చేసుకుంటారని చెప్పుకోవచ్చు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా తో వరుణ్ తేజ్ బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన రెమ్యూనరేషన్ 7 కోట్లకు పెరిగిపోయింది. తొలి ప్రేమ, గద్దలకొండగణేష్ తర్వాత ఇప్పుడు ఏకంగా రూ. 11 కోట్లకు పెరిగిపోయింది. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో కొంత కష్టపడడం తోపాటు నటనా ప్రతిభ కలిగి ఉండాలి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ కి నటనా ప్రతిభతో పాటు కష్టపడేతత్వం కూడా ఉంది.  అందుకే ఆయన్ని ఆరాధించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. మంచి కథలను ఎంచుకొని అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే వరుణ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలే రోజులు త్వరలోనే వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: