సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ మూవీ ఏదీ అంటే అంతా ఠక్కున చెప్పే జవాబు క్రాక్ అని. అంతలా మాస్ క్లాస్ జనాలకు క్రాక్ వీవర్ పట్టేసింది. రవితేజా లోని ఫుల్ ఎన‌ర్జీ లెవెల్స్ ని వాడేసుకుని మరీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్ ని బ్లాక్ బస్టర్ చేశాడు. రవితేజా మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్న సూపర్ హిట్ దాహాన్ని ఆలా తీర్చేశాడు.

మరి రవితేజా ఇపుడు క్రాక్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడట. ఇక ఆయన చేస్తున్న మరో మూవీ ఖిలాడీ. ఈ మూవీ టైటిల్ కూడా మాస్ కి టచ్ అయ్యేలా ఉంది. డైరెక్టర్ రమేష్ వర్మ. ఈ మూవీని కూడా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కి రిలీజ్ కొట్టాలని రవితేజా ఉన్నాడట. క్రాక్ హిట్ తో పూర్తిగా తన రూట్ మార్చేసిన రవితేజా ఇక మీద ఏడాదికి మూడు సినిమాలు అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడుట.

అందులో  భాగంగా 2021 లోనే మూడు సినిమాలు తీసుకురావాలని అనుకుంటున్నాడుట. సమ్మర్ కి ఖిలాడిని ధియేటర్లలోకి దించేసి ఆ తరువాత దసరా నాటికి మరో సినిమాతో రెడీ కావాలని కూడా చూస్తున్నాడుట. తనకు క్రాక్ రూపంలో భారీ హిట్ పడడంతో దాన్ని వాడుకుంటూనే బ్యాక్ టూ బ్యాక్ హిట్లు ఇవ్వాలని రవితేజా గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు.

అదే విధంగా క్రాక్ మూవీ సక్సెస్ ని రిపీట్ చేయాలని కసి మీద ఉన్నాడట. ఇక ఖిలాడీ ఫస్ట్ లుక్ ని తన బర్త్ డే సందర్భంగా రిపబ్లిక్ డే రోజున విడుదల చేయాలని కూడా మాస్ మహారాజా ఆలోచిస్తున్నాడుట. మొత్తానికి రవితేజా ఊపు మామూలుగా లేదని అంటున్నారు. ఇక క్రాక్ మూవీ హిట్ తో రవితేజా మూవీకి కావాల్సిన మాస్ మసాలా ఏంటి అన్నది డైరెక్టర్లకు తెలిసింది. దానికి తగిన కధలతో వారు మాస్ మహారాజని కలిసేందుకు క్యూ కడుతున్నారుట.



మరింత సమాచారం తెలుసుకోండి: