ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక్కడు సినిమా బాక్సాఫీసు దగ్గర ఎలాంటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఓ టీవీ ఛానల్లో జర్నలిస్టుగా పని చేస్తున్న హీరో కొన్ని కారణాల వల్ల ఒకరోజు సీఎంగా తన విధులను నిర్వహించాడు.ఈ ఒక్క రోజులో తను చేసిన మంచి పనుల వల్ల తన జీవితమే మలుపు తిరుగుతుంది.ఈ విధమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో ఘన విజయాన్ని సాధించింది.

ఒకే ఒక్కడు సినిమాలో హీరోగా అర్జున్ మనకు కనిపించారు. కానీ నిజానికి ఈ సినిమాలో హీరోగా అర్జున్ కన్నా ముందు దర్శకుడు శంకర్ ఈ కథను ఇళయదళపతి విజయ్ తండ్రికి వినిపించాడట. ఈ కథ తనకు నచ్చడంతో విజయ్ కు చెప్పమని శంకర్ కి చెప్పడంతో, శంకర్ ఈ కథ హీరో విజయ్ కి వినిపించాడు. హీరో విజయ్ కి కూడా ఈ కథ బాగా నచ్చింది. కానీ అప్పుడు వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న విజయ్ ఈ సినిమాలో నటించడానికి నిరాకరించాడు.

ఈ సినిమాలో నటించడానికి విజయ్ కాదనడంతో శంకర్ విజయ్ స్థానంలో అర్జున్ హీరోగా తీసుకొని సినిమాను తెరకెక్కించినట్లు ఓ సందర్భంలో స్వయంగా శంకర్ తెలియజేశాడు.అయితే కొన్ని సంవత్సరాల తర్వాత శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ చిత్రంలో విజయ్ నటించగా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదని చెప్పవచ్చు.సూపర్ హిట్ చిత్రంలో నటించే అవకాశాన్ని వదులుకొని విజయ్ ఈ విధంగా ఒక ఫ్లాప్ సినిమాలో నటించారు.                                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: