తెలుగు సినిమా పరిశ్రమలో విలన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో నాగుల పాటి శ్రీనివాస చక్రవర్తి కూడా ఒకరు. ఇంతకీ ఆయనెవరా అని అనుకుంటున్నారా ఆయనేనండీ మన జె డి చక్రవర్తి. ప్రఖ్యాత దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన శివ సినిమా ద్వారా తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జెడి చక్రవర్తి ఆ మూవీతో భారీ సక్సెస్ ని అందుకుని నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇక అక్కడి నుండి వరుసగా చాలావరకు సినిమాలు చేస్తూ కొనసాగిన జె.డి పలు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసి మరింత మంచి క్రేజ్ దక్కించుకున్నారు. కొన్నేళ్ళ క్రితం నుంచి సినిమాలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్న జెడి ప్రస్తుతం నటిస్తున్న సినిమా 70 ఎం ఎం. అతి త్వరలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ కి సంబంధించి పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు జె.డి. అందులో భాగంగా ఒకానొక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో జేడీ చక్రవర్తి తన సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా పంచుకున్నారు. తొలి సినిమా శివ తో తనకు ఎంతో మంచి పేరు వచ్చిందని ఆ పై ఎన్నో భాషల్లో కూడా నటుడిగా మంచి అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చారు.

దాని తర్వాత ఏకంగా 36 సినిమాల్లో తనకు విలన్ గా అవకాశాలు వచ్చాయని అయితే వాటిలో ఒకదాని వెంట ఒకటి అవకాశాలు వస్తూ ఉండటంతో ఏది చేయాలో తనకు ఇంత అర్థం కాలేదని అయితే తనకు మాత్రం అవేవీ చేయడం ఇష్టం లేక అందరు నిర్మాతలకు తాను ఎట్టిపరిస్థితుల్లో నటించలేనని ఫైనల్ గా తేల్చి  చెప్పానని అన్నారు జెడి. అయితే ఆ తర్వాత మనీ, మనీ మనీ, అనగనగా ఒక రోజు వంటి సినిమాలు నటుడిగా తనకు మరింత గుర్తింపు తెచ్చాయని, తప్పకుండా ప్రస్తుతం తెరకెక్కిన 70 ఎం. ఎం. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు జె.డి. రాబోయే రోజుల్లో మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటించడానికి తాను సిద్ధమేనని ఆయన మాట్లాడుతూ చెప్పారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: