ఆ హీరోకు సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఫుల్‌గా ఉంది. తండ్రి టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. బాబాయ్‌ ఇండియాలోనే  టాప్ డైరెక్టర్‌. ఇంత  బ్యాక్‌గ్రౌండ్‌ పెట్టుకొని.. హడావుడి లేకుండా నటించేస్తున్నాడు. వెనకాల ఉన్న సపోర్ట్‌ కంటే.. కొత్తదనం నిలబెడుతుందన్న పాయింట్‌తో దూసుకుపోతున్నా ఆ వారసుడు ఎవరో కాదు సింహా.  

సినిమా రిలీజ్‌ డేట్‌ను ఇలా కూడా ఎనౌన్స్‌ చేయొచ్చా అని చెప్పిన సినిమా 'తెల్లవారితే గురువారం'.  రిలీజ్ డేట్‌ ఎనౌన్స్‌మెంట్ వీడియోనే కాదు.. సినిమా టైటిలే విచిత్రంగా ఉంది.  కీరవాణి చిన్న కొడుకు సింహా హీరో. చిత్రా శుక్లా హీరోయిన్‌. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. యమదొంగ.. మర్యాదరామన్నలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు సింహా.  హీరో కావడానికి ముందు.. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ చేరి అనుభవం గడించాడు. తన ఫ్యామిలీ గురించి చెప్పకుండా.. రంగస్థలం సినిమాకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు.

సింహా 'మత్తు వదలరా'తో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తొలి అడుగులోనే.. ఇంప్రెస్‌ చేశాడు. మంగళవారం బర్త్‌డే సందర్భంగా హీరో నటిస్తున్న మరో మూవీ 'భాగ్‌సాలే'ను ప్రకటించారు. సురేష్‌బాబు దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు.  క్రైమ్‌ కామెడీగా తెరకెక్కే ఈ మూవీకి  ప్రణీత్‌ దర్శకుడు. వెనకాల  ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ ఉన్నా..  తనకంటూ ఓ టీం ఏర్పాటు చేసుకుని.. డిఫరెంట్‌ స్టోరీస్‌తో వస్తున్నాడు సింహా.  మత్తు వదలరా.. తెల్లవారితే గురువారం.. భాగ్‌ సాలే.. ఇలా సింహా నటించే ప్రతి సినిమాకు ఆయన సోదరుడు కాలభైరవ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. నాన్న ,  బాబాయ్‌ క్రేజ్‌ను వాడుకోకుండా... ఈ అన్నాదమ్ములు చిన్న సినిమాలతో కెరీర్‌ స్టార్ట్ చేసి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు.

మొత్తానికి శ్రీ సింహా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరిగా వినియోగించుకోలేదు. మత్తువదలరా సినిమాతో కీరవాణి చిన్న కొడుకు సింహా ఎంట్రీ ఇచ్చినా.. అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేదు. ఎలాంటి హడావిడి లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు సింహా.



మరింత సమాచారం తెలుసుకోండి: