జయమ్మ..జయమ్మ.. జయమ్మ.. సంక్రాంతికి కానుకగా వచ్చిన క్రాక్ సినిమా చూసిన ప్రతి ఒక్కరి నోట వినిపించిన పేరు జయమ్మ.. అంతలా ఆ పాత్ర కు ఆమె ప్రాణం పోసింది.. ఆమె ఎవరో కాదు.. వరలక్ష్మి  శరత్ కుమార్.. గత మూడు సంవత్సరాలుగా అసలు తన సిని కెరియర్లో విజయం అంటూ చూడని మాస్ మహారాజా రవితేజ కు మూడు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు 2021లో" క్రాక్" సినిమా ద్వారా భారీ విజయాన్ని అందించింది జయమ్మ.. ఇక అలాగే గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టడానికి కింద మీద పడుతున్న అల్లరి నరేష్ కు "నాంది"  సినిమా ద్వారా హిట్ ను అందించింది.

ఈ రెండు సినిమాలలో కూడా వరలక్ష్మీ ప్రాత చాలా కీలకంగా ఉంటుంది.  దాంతో "ఫ్లాఫ్ లతో కొట్టుమిట్టాడుతున్న హీరోలకు ఐరన్ లెగ్ గా మారిపోయిన వరలక్ష్మి " అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్ కూడా పెడుతున్నారు.. ఒక్కసారిగా ఆమె బరిలోకి దిగి  రాకెట్ లా దూసుకుపోతూ,  మన స్టార్ హీరోల తలరాతను కూడా మార్చే స్థితికి చేరుకుంది వరలక్ష్మి..


ఈమె తన సినీ కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో కథానాయికగా నటించినప్పటికీ, ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక దాంతో ఆమె చేసేదిలేక నెగిటివ్ రోల్స్ వైపు మళ్ళింది.. ఈమె నటించే తీరు ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకోవడంతో విలన్ రోల్స్ ని ఎంచుకొని, దూసుకు వెళుతోంది వరలక్ష్మి. ఈమె తమిళ ఇండస్ట్రీకి చెందినప్పటికీ ఈమెకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు..కానీ తెలుగులో మాత్రం ఈమెకు మంచి గుర్తింపు దక్కింది.

మొదట్లో పందెంకోడి 2, సర్కార్ వంటి డబ్బింగ్ చిత్రాల్లో నటించినప్పటికీ, ఈ రెండు చిత్రాలు బాగా రావడంతో ఇక ఈమె పాత్ర హైలెట్ గా నిలిచింది.. అంతేకాకుండా ప్రస్తుతం విడుదలైన క్రాక్,నాంది సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో, తెలుగులో ఈమెకు మరిన్ని ఆఫర్లు కూడా ఈమె కోసం ఎదురు చూస్తున్నాయి.. ఏది ఏమైనా తమిళ్ ఇండస్ట్రీ లో రాణించలేకపోయినప్పటికి, తెలుగు ఇండస్ట్రీలో మాత్రం బెస్ట్ లేడీ  విలన్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది వరలక్ష్మి..

మరింత సమాచారం తెలుసుకోండి: