కొరటాల శివ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది..మామూలుగానే మెగాస్టార్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందునా కొరటాల శివ డైరెక్షన్ అనడంతో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ తేజ్  కూడా ఓ ముఖ్యమైన పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే.. సిద్ద అనే పాత్రలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుండటం అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది.

ఇకపోతే మెగాస్టార్ కు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోడయితే ఎలా ఉంటుందో “ఖైదీ నెంబర్ 150″లో మెగా ఫ్యాన్స్ రుచి చూసారు. కానీ దానికి డబుల్ ట్రిపుల్ హై ఇచ్చే సాంగ్ “ఆచార్య”లో ఉన్నట్టుగా టాక్. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మెగా ఫ్యాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఇచ్చే సాంగ్ ను ప్లాన్ చేసారని తెలుస్తుంది. ఇందులో చిరు మరియు చరణ్ లు వేసే స్టెప్స్ కూడా అంతకు మించే ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మణిశర్మ ఇచ్చిన ట్యూన్ కూడా ఫీస్ట్ లా ఉంటుందని అంటున్నారు. అలాగే మరో పక్క ఈ సినిమా ఆల్బమ్ పై కూడా కాస్త బజ్ కూడా మొదలయ్యింది. వేచి చూడాలి మరి చిరు మణిశర్మ కాంబో మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: