జూనియర్ ఎన్టీఆర్ తాను నటించిన 'అరవింద సమేత వీర రాఘవ' తరవాత ఇంకో చిత్రం విడుదల కాలేదు.ఈ చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు దాటిపోతుంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తదుపరి సినిమా కోసం వేగిరాగా ఎదురు చూస్తున్నారు. ఆలా ఎదురు చూస్తున్న సమయం లో అనౌన్స్ చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం,రణం,రుధిరం) దర్శక ధీర జక్కన చెక్కుతున్న చిత్రం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ చిత్రంతోనే బిజీగా ఉన్నారు.

అయితే ఎన్టీఆర్ 2010 నుంచి సంవత్సరానికి ఒక్క సినిమా అయిన విడుదల చేయాలనే ప్లాన్ తో ముందుకు  వచ్చారు. ఆలా అరవింద సమేత సినిమా వరకు విడుదల చేసారు. ఇప్పుడు రెండు సంవత్సరాల విరామం వచ్చింది. అయితే దీనిని అవకాశంగా చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు.అదేంటంటే, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం లో మరో సినిమాలో నటిస్తారు.

ఆర్ఆర్ఆర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల అవుతుండగా, ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలయికలో రూపొందే చిత్రం వచ్చే సంవత్సరం మర్చి లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మలయాళీ రీమేక్ 'అయ్యప్పన్ కోషియమ్' కు పనిచేస్తుండగా, దీని తర్వాత ఎన్టీఆర్ తో షూటింగ్ ను ప్రారంభిస్తారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకి కొన్ని నెలల గ్యాప్ తో ఎన్టీఆర్-త్రివికమ్ సినిమాని కూడా విడుదలచేయాలని చూస్తున్నారు. ఈ లెక్కన ఎన్టీఆర్ ముందు అనుకున్న విధంగా ఏడాదికి  ఒక సినిమా విడుదల చేసినట్టు అవుతుంది.
 
ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ రావడం తో ఇకపై తాను చేయబోయే సినిమాలకి ఇంత  గ్యాప్ రాకుండా ఎన్టీఆర్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ విషయం తో జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఆనందపడుతున్నారు.ఇక ఎన్టీఆర్  త్రివిక్రమ్ సినిమా తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: