సినిమా చరిత్రలో కొన్ని అసలు జరగవు. అక్కడ లెక్కలు వేరు. అవి అసలు కుదరవు కూడా. సినిమా కాలంతో పాటుగా ముందుకు సాగుతుంది. కాలంతో పోటీ పడుతుంది. ఒక్కోసారి కాలం కంటే కూడా పది అడుగులు ముందుకు వేస్తుంది.

అలాంటి సినీ సీమలో ఎపుడూ కొత్త నీరే దూసుకువస్తుంది. ఒకసారి రేసులో వెనకబడి కాలచక్రం పెద్ద చక్రాల కింద పడిన వారు తిరిగి తేరుకోలేరు. అదే విధంగా వారిని మళ్ళీ ముందుకు తెచ్చే సీన్ కూడా ఉండదు. ఎందుకంటే కాలం ఎపుడూ వెనక్కి తిరిగి చూడదు. అలాగే సినీ పరిశ్రమ కూడా. కానీ కొన్ని సందర్భాల్లో కొందరికి మాత్రం ఆ పరిస్థితి మారుతుంది. వారి వద్దకు ఒకసారి వచ్చి అంతా చూస్తారు. అలాంటి అదృష్టవంతుల జాబితాలో ఇపుడు మణిశర్మ చేరాడు.

మణిశర్మ అద్భుతమైన మ్యూజీషియన్. ఆయన చేసిన ఎన్నో సినిమాలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. మణిశర్మ లేని అగ్ర హీరోల  సినిమాలు ఒకసారి వెనక్కి వెళ్తే ఎవరికీ కనిపించవు. అటువంటి మణిశర్మ కాల  మహిమ వల్ల వెనకబడిపోయాడు. అయితే ఆయన ఇస్మార్ట్ శంకర్ మూవీతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఈ తరానికి తగినట్లుగా ఇస్మార్ట్ శంకర్ లో మ్యూజిక్ ఇరగదీశాడు.

అంతే మణి మళ్ళీ కావాల్సిన వాడు అయిపోయాడు. చిరంజీవి సినిమా ఆచార్యకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. దాంతో ఆ మ్యూజిక్ మీద అందరికీ పెద్ద అంచనాలూ ఆశలు పెరిగాయి. ఇక మరో వైపు జూనియర్ ఎన్టీయార్ 30వ సినిమాకు కూడా మణిశర్మ మ్యూజిక్ చేస్తున్నాడు. ఇలా మళ్ళీ నాటి స్టార్లను ఒక్క రౌండ్ చుట్టేలాగానే మణిశర్మ ఉండడం విశేషం. ఇపుడు మణిశర్మ తన శిష్యులతో పోటీ పడుతున్నారు. తన కొడుకుతో పోటీ పడుతున్నాడు. మొత్తానికి మణి శర్మ కొత్త రికార్డులే క్రియేట్ చేశాడు. ఇదే ఊపు కొనసాగితే మరింతకాలం మ్యూజిక్ మ్యాజిక్ చేయడం ఖాయమని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: