సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోల సినిమాల వేడుకల్లో ఆ డైరెక్టర్లు మాట్లాడే విధానాన్ని బట్టి. సినిమా బ్లాక్ బాస్టర్ అనుకుంటాము. కానీ రిలీజ్ అయిన తర్వాత సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోయాయి   ఈ 6 సినిమా వేడుకల్లో అవి కూడా స్టార్ హీరోల సినిమాల వేడుకలలో పెద్దలు ఇచ్చిన బ్లాక్ బాస్టర్ స్పీచ్ లు,  ఆ తర్వాత సినిమా హిట్ మిస్సయిన సందర్భాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.

1). బ్రహ్మోత్సవం - నరేష్ స్పీచ్: మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమా గురించి నరేష్ మాట్లాడిన మాట. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి లో పడే కలెక్షన్లను బ్రహ్మోత్సవం సినిమా దాటేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ప్రేక్షకులకి ఈ సినిమా బోర్ కొట్టగా, సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

2). అజ్ఞాతవాసి-త్రివిక్రమ్ స్పీచ్: పవన్,  త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఓ లెవల్ లో ఉంటుంది అనుకుంటారు . కానీ అజ్ఞాతవాసి సినిమా స్పీచ్ లో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడిన మాట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు  అని చెప్పడంతో విని ప్రేక్షకులు సినిమాకి వెళ్ళగా, ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది.


3). సర్దార్ గబ్బర్సింగ్-బాబి స్పీచ్: గబ్బర్ సింగ్ తర్వాత గబ్బర్ సింగ్ 2, ఈ సినిమా భారీ అంచనాల మీద విడుదల అవుతుండగా డైరెక్టర్ బాబీ ఏమన్నాడంటే.. ఈ సినిమా క్లైమాక్స్ లో పేపర్లు సరిపోవు షర్ట్ లు చింపేసుకుంటారు..అందుకే  మరొక షర్ట్ ను తీసుకెళ్లండి అని చెప్పాడు. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చూసింది.


4). రెబల్ - రాఘవ లారెన్స్ స్పీచ్: డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్ వంటి క్లాస్ సినిమాలో నటించిన ప్రభాస్మాస్ ని ఇష్టపడితే ఎలా ఉంటుందో అంటూ మాట్లాడి..అందర్నీ టెమ్ట్ చేశాడు. కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు నీరసం వచ్చేస్తుంది. ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ ను చవిచూసింది.

5). వినయ విధేయత రామ - బోయపాటి స్పీచ్ : గుండె మీద చెయ్యి వేసుకుని సినిమా కి వెళ్ళండి అంటూ సినిమాలో ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు. బోయపాటిశీను. ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

6). శక్తి - మోహర్ రమేష్ స్పీచ్ : ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో అతి పెద్ద డిజాస్టర్ సినిమా అని చెప్పవచ్చు. శక్తి సినిమా ఆడియో రిలీజ్ వేడుకలలో డైరెక్టర్ మోహర్ రమేష్ స్పీచ్ విని సినిమాకి వెళ్ళిన ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ ను చవిచూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: