రజనీకాంత్ వయసు ఏడు పదులు. ఆయనకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయినా కూడా చాలా మంది కంటే తాను నయం అని ఈ తమిళ సూపర్ స్టార్ నిరూపించారు. ఇపుడు దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఎవరు బయటకు వచ్చే పరిస్థితి అసలు లేదు.

అటువంటి  నేపధ్యంలో రజనీ చాలా ధైర్యంగా వచ్చి   అన్నాత్తే షూటింగ్ ప్లాన్ చేసారు. దాదాపుగా 35 రోజుల లాంగ్ షెడ్యూల్ ని ఆయన హైదరాబాద్ లో ఉండి పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ అగ్ర హీరోలు సైతం షూటింగ్ ఈ టైమ్ లో వద్దు అని ఇంటికే పరిమితం అయ్యారు.

కొందరు యంగ్ హీరోలు డేరింగ్ చేసి షూటింగ్ చేసినా కూడా కరోనా బారిన పడారు. అలాంటిది రజనీకాంత్ లాంట్ వారు ఈ వయసులో బయటకు రావడమే గొప్ప.  ఇక  షూటింగ్ చేయడం అంటే హాట్సాఫ్ రజనీ అనాలి. ఇలా రజనీ ఎందుకు బిగ్ రిస్క్ చేశాడు అంటే కేవలం నిర్మాత శ్రేయస్సు దృష్టిలో పెట్టుకునే అంటున్నారు. నిజానికి ఈ సినిమా ఎపుడో కంప్లీట్ కావాలి. అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

దాంతో ఈసారి ఎట్టిపరిస్థితులోనూ పూర్తి చేసి నిర్మాతకు బడ్జెట్ ఖర్చు తగ్గించాలని రజనీ కంకణం కట్టుకున్నారుట. దాని ఫలితమే ఈ భారీ రిస్క్ అంటున్నారు. ఇక ఈ మూవీ అన్నీ అనుకూలంగా ఉంటే ఈ ఏడాది నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల చేస్తారు అంటున్నారు. మొత్తానికి రజనీ సూపర్ స్టార్ ఎందుకు అయ్యాడు అన్నది ఈ మూవీ ద్వారా మరోమారు ప్రపంచానికి తెలిసింది అంటున్నారు. ఏది ఏమైనా రజనీ తలచుకుంటే చాలు చేసి తీరుతారు అని అంటారు. ఆయన మొండితనం పట్టుదలే ఈ స్థాయికి తెచ్చాయని కూడా చెబుతారు. ఎనీ వే గ్రేట్ రజనీ.





మరింత సమాచారం తెలుసుకోండి: