డబ్బుంటే ఏదైనా కొనవచ్చు కానీ సంతోషాన్ని మాత్రం కొనలేము అనే మాట చాలా చోట్ల మనకు వినిపిస్తుంది.. దీన్ని కొంతమంది తారలు నిజం చేసి చూపిస్తున్నారు కోట్లకు ఉన్న వారిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు.. ఎప్పుడు డబ్బులో మునిగితేలే బిజినెస్ టైకూన్ లను పెళ్లాడిన వారు కొంతమందైతే, తమ పేరు బలం తోనే డబ్బు సంపాదించే సెలబ్రిటీలను పెళ్లి చేసుకున్నారు మరి కొంతమంది .. డబ్బు కు డబ్బు సంతోషానికి సంతోషం పొందుతున్న ఆ తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా ఉన్న అమల నాగార్జున తో ప్రేమలో పడి ఆయనను పెళ్లాడారు.. అప్పటికి అన్నపూర్ణ స్టూడియోస్ లో భాగస్వామ్యం ఉన్న నాగార్జున ఆ తర్వాత పలు వ్యాపారాలు నెలకొల్పి టాలీవుడ్ రిచెస్ట్ పర్సన్ లలో ఒకరిగా ఎదిగారు.. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ విరాట్ కోహ్లీ ని 2017 లో పెళ్లాడింది అందాల తార అనుష్క శర్మ.. బీసీసీఐ ద్వారా ఏటా 7కోట్ల వేతనం అందుకుంటున్న విరాట్ పలు పేరుపొందిన బ్రాండ్లకు అంబాసిడర్ గా పనిచేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు..

టాలీవుడ్ బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉన్న ఆసిన్ మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మ నీ పెళ్లి చేసుకుంది. అతని కంపెనీ ఏటా బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది.. అతనికి ఉన్న 668 కోట్ల విలువచేసే విగ్రహ ఆస్తులకు ఓనర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.. నాగార్జున సూపర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అయేషా టాకియా ఫేమస్ పొలిటీషియన్ అబు అజ్మీ కుమారుడు ఫరాన్ అజ్మి ను పెళ్లి చేసుకుంది.. ధర్మేంద్ర హేమ మాలిని ల కూతురు ఇష డియోల్  తన చిన్ననాటి స్నేహితుడు భరత్ ని పెళ్లి చేసుకుంది అతనికి వజ్రాల సంస్థ ఉంది.. జూహి చావ్లా, నమ్రత, రాణీముఖర్జీ , రవీనాటాండన్,  శిల్పా శెట్టి , సోనం కపూర్,  విద్యాబాలన్.. వీళ్ళందరూ ప్రపంచంలోనే ధనికులు ఉన్న వారుని పెళ్లి చేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: