మూవీ మొగల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు గా, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు గా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా ఒకపక్క హీరో పాత్రలతో మరోపక్క నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కూడా నటిస్తూ తాను అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధమే అని చెబుతూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం విరాటపర్వం మూవీ తో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. 2010లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన రానా బాహుబలి మూవీలో బల్లాలదేవుడు గా విలన్ రోల్ చేసి తన నటనతో ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు.

తెలుగులో మాత్రమే కాకుండా ఆయన హిందీ తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసి మంచి అభిమానాన్ని పొందాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అలాగే ఏసీఎంఈ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చదువుకున్న రానా ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ పూర్తి చేశాడు. గత ఆగస్టు 8న మిహికా బజాజ్ అనే అమ్మాయితో పెద్దల ఆశీర్వాదంతో రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా వివాహం చేసుకున్నాడు రానా. స్కూల్ డేస్ లో  రామ్ చరణ్, శర్వానంద్, అల్లు శిరీష్ ల క్లాస్ మేట్ అయిన రానా సినిమాల్లో చేయాలని భావించి 9వ తరగతి లోనే వుడ్ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ నేర్చుకున్నాడు.

ఇంటర్ చదివే రోజుల్లోనే సినిమాలకు గ్రాఫిక్స్ డిజైన్ చేసేవాడు. హీరోగా చేయాలనుకుని లీడర్ మూవీ తో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు ఈ మూవీకి 1.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత మంచి సినిమాలు చేసి ఇ హిట్ కొట్టాడు 2017 లో నేనే రాజు నేనే మంత్రి సినిమా మరియు ఘాజి వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ మూవీస్ చేశాడు. చికెన్ బిర్యాని అంటే ఇష్టపడే రానాకు లండన్ అంటే ఇష్టం. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఖరీదైన ఇల్లు, రెండు విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: