సమంత ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయారు. ఇక అప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ పోషించిన సమంత పెళ్లి తరువాత తన రూట్ మార్చుకుంది. ఇక వీలైనన్ని సినిమాలు చేసేయాలని తొందర పడకుండా సరికొత్త కథలను ఎంచుకుంటుంది ఈ భామ. ప్రస్తుతం సమంత గ్లామర్ డోస్ ని తగ్గించింది. ఒక్కరకంగా చెప్పాలంటే సమంత కమర్షియల్ కథలకు దూరంగా ఉంటుంది.

ఇక ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తప్ప వేరే ప్రాజెక్ట్స్ ఏమి లేవు. అయితే రీసెంట్ గా చాలా మంది దర్శకనిర్మాతలు ఆమెని కలిసి కథలు వినిపించారట.. కానీ సమంత దేనికి ఓకే చెప్పలేదంట. ఇక ఒకట్రెండు భారీ సినిమా అవకాశాలను కూడా వదులుకున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మధ్య మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమా కోసం సమంతను సంప్రదించారంట. అయితే సమంత  మొహమాటం లేకుండా నో చెప్పారని తెలుస్తోది.

అయితే గతంలో ఇదే బ్యానర్ లో రెండు సినిమాలు చేసింది ఈ భామ. ఇక వారిచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట సమంత. అయితే కొంతకాలం పాటు పెద్ద హీరోల సినిమాలకు దూరంగా ఉండాలనేది సమంత ఆలోచన అని కొందరు సినీ ప్రముఖులు బావిస్తున్నారు. అంతేకాదు.. సమంత దృష్టి మొత్తం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఉందని తెలుస్తోంది.

సమంత ఈ మధ్యకాలంలో లేడీ ఓరియెంటెడ్ కథలు వస్తున్నా.. అందులో కూడా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్ నే ఎంచుకుంటుంది. ఇక అందుకే స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలను పక్కన పెడుతోంది ఈ భామ. అంతేకాదు.. గతంలో తమిళంలో నయనతార కూడా ఇలానే చేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినప్పుడే వాటిని పక్కన పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది నయనతార. ఇక ఇప్పుడు దక్షిణాది సూపర్ స్టార్ ఇమేజ్ ని దక్కించుకుంది ఆ భామ. ఇక ప్రస్తుతం సమంత కూడా ఇదే రూటులో నడుస్తునట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: