విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్పక విమానం. కమల్ హాసన్ సినిమా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందట. ఈ సినిమాను విజయ్ దేవరకొండ సమర్పిస్తుండగా గోవర్ధన్ దేవరకొండ, ప్రదీప్ ఎర్రబల్లి, విజయ్ రుషి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకు జోడీగా గీతా శైనీ, శాన్వి మేఘన నటిస్తున్నారు. సినిమా నుండి మొద్టటి సాంగ్ కళ్యాణ్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శుక్రవారం సమంత చేతుల మీదుగా పుష్పక విమానం కళ్యాణం సాంగ్ రిలీజైంది.

రామ్ మిరియాల మ్యూజిక్ అందించిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. సిద్ శ్రీరాం ఆలపించిన ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు పెంచారు. సాంగ్ కోసం మంగ్లీ, మోహన్ బోగరాజు, దివ్యా మాలిక్ కూడా స్వరాన్ని అందించారు. ఈమధ్య సినిమాలకు సాంగ్స్ తోనే ఓ హైప్ తెచ్చేస్తున్నారు. ముఖ్యంగా సిద్ శ్రీరాం పాట పాడాడు అంటే అది ట్రెండింగ్ లో ఉండాల్సిందే. పుష్పక విమానం కళ్యాణం సాంగ్ కూడా యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉందని తెలుస్తుంది.

మొదటి సినిమా దొరసాని జస్ట్ యావరేజ్ అనిపించుకున్నా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం పుష్పక విమానం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కళ్యాణం సాంగ్ తో సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు. ఈ సినిమాకు రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని ముగ్గురు మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. కళ్యాణ్ సాంగ్ మాత్రం రాం మిరియాల మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చింది. పెళ్లి పాటగా వచ్చిన ఈ సాంగ్ ఇక మీదట ప్రతి పెళ్లి వేడుకలో వినిపించడం పక్కా అని చెప్పొచ్చు. ఈ సాంగ్ తోనే సినిమాపై ఓ పాజిటివ్ బజ్ ఏర్పడింది.






మరింత సమాచారం తెలుసుకోండి: