కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సోనూ సూద్ చేసిన సేవలు మరువలేనివి.. వలస కూలీల పట్ల ఈ చూపిన ప్రేమ అంతా ఇంతా కాదు. సాయం అనే మాట వింటే అస్సలు అర క్షణం కూడా ఆగకుండా వస్తాడు ఈ హీరో. దాంతో రీల్ హీరో కాస్త రియల్ హీరో అయ్యాడు. అప్పటి నుంచి చాలా మందికి చాలా రకాలుగా సాయాన్ని అందిస్తున్నారు. జనం కూడా అతను చేస్తున్న జేజేలు పలుకుతున్నారు.


ఇకపోతే ఎంత బిజీగా ఉన్నా కూడా తన కొడుకుకు మాత్రం ఎటువంటి లోటు రానివ్వడు. ఎప్పుడు కొడుకు ఆనందాన్ని మరింత పెంచుతూ వస్తున్నాడు. ఈరోజు ఫాదర్స్ డే.. ఈ సందర్భంగా ఆయన కొడుకు పై  తనకున్న ప్రేమను వస్తువు రూపంలో చూపించాడు. తన కుమారుడు ఇషాంత్ సూద్ కి చక్కని గిఫ్ట్ ఇచ్చాడు. తన ఆశయాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. ఆ కుర్రాడి ఆనందంలో తానూ కూడా భాగస్వామి అయ్యాడు. బ్లాక్ కలర్ లో ఉన్న మెర్సిడెస్ మే బ్యాచ్ జీఎల్ఎస్ 600 టైప్ కారు ఖరీదెంతో తెలిస్తే నోర్లు వెళ్ళబెట్టాల్సిందే..


ఆ కారు గిఫ్ట్ ఇవ్వడంతో పాటుగా తన పిల్లలను తీసుకొని ముంబై నగరంలో షికారు చేశారు. ఈ కారు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉందిటచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్, ఫైవ్ సీట్ వెర్షన్ తో పాటిగా మరెన్నో ఉన్నాయి. మొత్తానికి తన కొడుకుపై తనకున్న ప్రేమను లగ్జరి కారు రూపంలో చూపించాడు. కొడుకు కారు గిఫ్ట్ ఇచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్, చల్ చేస్తున్నాయి. సినిమాల విషయానికి వస్తే..పృథ్వీరాజ్, ఆచార్య వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా పేదలకు సాయం చేయడానికి మాత్రం ఎప్పుడూ ముందే ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: