రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.అయితే మరోవైపు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ' సినిమా ఆర్ ఆర్ ఆర్ తో ఏకంగా రెండు సార్లు పోటీ పడనుందని తాజాగా ఇండ్రస్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆగస్టు 1 న ఆర్ ఆర్ ఆర్ నుంచి ఓ పాటు విడుదల కానున్న సంగతి తెలిసిందే.

అయితే అఖండ సినిమా నుంచి కూడా ఆగస్టు తొలి వారంలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్.అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.మరోవైపు ఇటీవల బాలయ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అఖండ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.అక్టోబర్ తొలి వారంలోనే అఖండ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే అఖండ సినిమాకి ఆర్ ఆర్ ఆర్ కి మధ్య కొద్ది పాటి గ్యాప్ అనేది ఉన్నా..ఒక విధంగా ఇది ఎన్టీఆర్, బాలయ్యల మధ్య పోటీ ఉన్నట్లే అని చెప్పాలి.ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్..

టాక్ విషయంలో ఆర్ ఆర్ ఆర్ పై చేయి సాధిస్తుందో.. లేక అఖండ పై చేయి సాధిస్తుందో చూడాలి.ఇక  ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటుగా బాలయ్య అఖండ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి ప్రేక్షకుల్లో. బోయపాటి శ్రీను, బాలయ్య ల కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ సినిమా కావడం.. ఇప్పటికే ఈ సినిమా టీజర్లకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని బాలయ్యకు ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.మరి విడుదల తర్వాత అఖండ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: