టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మాట‌ల మాత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సినిమా అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవస‌రం లేదు. వీరి కాంబో వ‌చ్చిన జులాయి, అల వైకుంఠ‌పురంలో సినిమాలు టాలీవుడ్ రికార్డుల‌ను షేక్ చేశాయి. స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చినప్ప‌టికి జులాయి, అల వైకుంఠ‌పురం రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయితే వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌త‌క‌ట్టారు. కానీ ఈసారి అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ జ‌త క‌ట్టింది సినిమా కోసం కాదు ఓ యాడ్ షూట్ కోసం. త్రివిక్ర‌మ్ మ‌రియు అల్లు అర్జ‌న్ క‌లిసి రాపిడో బైక్స్ యాప్ కోసం యాడ్ షేట్ చేస్తున్నారు. త్రివిక్ర‌మ్ సినిమాల‌తో పాటు యాడ్స్ కూడా చిత్రిస్తుంటారు. 

ఈ నేప‌థ్యంలోనే రాపిడో కోసం ఆయ‌న యాడ్ ను చిత్రిస్తున్నారు. ఇక ఈ రోజు రాపిడో యాడ్ షూట్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అయ్యింది. దాంతో బన్నీ త్రివిక్ర‌మ్ తో ఉన్న ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలో క‌నిపించ‌బోతున్న లుక్ లో మాసిన్ గ‌డ్డం మ‌రియు లాంగ్ హెయిర్ స్టైల్ తో క‌నిపిస్తున్నారు. దాంతో అభిమానులు అంతా స‌డెన్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సినిమాను షురూ చేశారేంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక బ‌న్నీ అభిమానులు త్రివిక్ర‌మ్ మ‌రో సినిమా త‌మ అభిమాన హీరోతో చేయాల‌ని కోరుతున్నారు.

ఇక రీసెంట్ గా సాక్షి ఎక్స‌లెన్స్ అవార్డుల్లో కూడా వీరి కాంబోలో వ‌చ్చిన అల వైకుంఠ పురం సినిమాకు అవార్డుల పంట పండి. ఉత్త‌మ న‌టిగా పూజా హెగ్డే, ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్, ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, ఉత్త‌మ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా త‌మ‌న్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. ఇక కొద్ది రోజులుగా త్రివిక్ర‌మ్ బ‌న్నీతో మ‌రో సినిమా చేస్తార‌ని కూడా వార్తలు వ‌స్తున్నాయి. బ‌న్నీ ప్ర‌స్తుతం న‌టిస్తున్న  పుష్ఫ సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌ర‌వాత త్రివిక్ర‌మ్ సినిమా ఉంటుందని వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: