ఇటీవల కాలంలో మన టాలీవుడ్ స్టార్ హీరోలు నటన పైన మాత్రమే కాకుండా ఇతర వ్యాపార రంగాలలో కూడా ఫోకస్ పెట్టి రెండు చేతులా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు తమకు అనువైన రంగాలలో పెట్టుబడులు పెట్టి ఆ రంగాలలో దూసుకుపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఒకరు హోటల్ బిజినెస్ లో, ఇంకొకరు వస్త్రాల బిజినెస్ లో ఇంకొకరు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది హీరోలు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగి ఆ వ్యాపారంలో దూసుకు వెళ్తున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబీ అనే పేరుతో మల్టీప్లెక్స్ వ్యాపారాన్ని మొదలు పెట్టగా అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సిటీ లోనే అతి పెద్ద థియేటర్ గా మహేష్ బాబు ఏ ఎం బి మల్టీప్లెక్స్ నిలవగా ఇప్పుడు ఆయన బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పయనిస్తున్నాడు. మహబూబ్ నగర్ లో ఏవీడి అనే పేరుతో ఆయన మల్టీప్లెక్స్ ను ప్రారంభించి మరో రికార్డును క్రియేట్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా తో మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 24వ తేదీన గ్రాండ్ గా మొదలు కాబోతుంది.

అంతేకాదు వీరి బాటలోనే మరికొంత మంది హీరోలు పయనించే దిశగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా ఓ మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మిస్తుండగా ప్రభాస్ గూడా అదేవిధంగా ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. మరి మన హీరోల ఫోకస్ దీనిపై ఎందుకు మల్లిందో తెలియదు కానీ సొంతంగా థియేటర్లు కట్టుకుంటూ అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా థియేటర్ల యాజమాన్యాలు కొంత ఆందోళన చెందుతున్నారు. మరి ఈ నలుగురు స్టార్ హీరోలు మాత్రమే కాకుండా మిగతా వారు కూడా ఈ విధమైన ఆలోచనలు చేస్తారా అనేది చూడాలి. అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ కూడా తొందర్లోనే ఓపెన్ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: