విద్యుత్ సరఫరా పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్ మరియు ఫేక్ కాల్స్ ను అసలు నమ్మకూడదని తెలంగాణ సి.ఎం.డి రఘు మా రెడ్డి పేర్కొన్నారు.  విద్యుత్తు కస్టమర్లకు విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండటం కారణంగా.. రాత్రి సమయంలో అంటే రాత్రి పది గంటల తర్వాత.. విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని కొన్ని మోసపూరితమైన మెసేజ్ లు మరియు కాల్స్ వస్తున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే.. విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని కూడా చెప్పడమే కాకుండా... 9692848762 ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలని కొందరు వినియోగదారులకు ఫోను చేస్తున్నారంటూ ఆయన వివరించారు.

గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసు కున్నాయి అని పేర్కొన్నారు రఘుమా రెడ్డి. ఇలాగే విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే రాత్రి సమయంలో... ఎలక్ట్రిసిటీ తీసి వేస్తామని కొన్ని ఫేక్ కాల్స్ వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా చాలామంది వినియోగదారుల నుంచి డబ్బులు కూడా లాగేసారని పేర్కొన్నారు సంస్థ చైర్మన్ రఘుమా రెడ్డి. డబ్బులు చెల్లిం చకపోతే బెదిరింపులకు సైతం దిగారని... ఇదే విధంగా చాలా మంది మోసాలకు గురి అయ్యారు అని గుర్తు చేశారు. 

ఒకవేళ ఎవరైనా  అపరిచితులు.. ఫోన్లు చేసి ఈ విద్యుత్ బిల్లులు చెల్లించాలని అడిగినప్పుడు.. tsspdcl మొబైల్ యాప్ లో...   చెల్లించిన వివరాలను తెలుసుకోవాలని సూచనలు చేశారు. ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన... స్థానిక విద్యుత్ అధికారులను సంప్రదించాలని... ఫేక్ కాల్స్ మరియు ఫేక్ మెసేజ్ ల  కారణంగా మోసాలకు గురి కాకూడదనే పేర్కొన్నారు. ఇలాం టి అపరిచితులు ఎవరైనా... ఫోన్లు కానీ..  మెసేజ్‌ లు కానీ చేస్తే... తక్షణమే.. పోలీసులు ఫిర్యాదు కూడా చేయవచ్చన్నారు.   అలాంటి దుండగులను పట్టించిన వారికి తగిన గుర్తింపు కూడా ఇస్తామని తెలిపారు.  కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు తెలంగాణ సి.ఎం.డి రఘు మా రెడ్డి 

మరింత సమాచారం తెలుసుకోండి: