దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల వాయిదా పడటంతో ప్రేక్షకులు ఒక్కసారిగా నిరాశ చెందారు. మొదటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ చిత్రం విడుదల తేది కన్ఫర్మ్ గా చెప్పట్లేదు కానీ ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది అని మాత్రం చెబుతున్నారు.  అక్టోబర్ నెల చివరి వారం నాటికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయి అని తెలుస్తుంది.

అప్పుడు విడుదల తేదీ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కాకపోవడంతో తాత్కాలికంగా ఈ సినిమా ప్రమోషన్ కు బ్రేక్ వేసిన రాజమౌళి వచ్చే ఏడాది ఈ సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల కంటే వచ్చే ఏడాదే విడుదల బాగుంటుందని చిత్రబృందం కూడా అనుకుంటుందట.  బాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ లతో క్లాష్ ఏమాత్రం అవకుండా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించా లనీ జక్కన్న భావిస్తూన్నాడు. అందుకే ఈ సినిమా ను విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు.

అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్ 550 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ అందుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా కష్టం. ఒకవేళ సాధించకపోతే తనకు అవమానం అని భావించిన రాజమౌళి ఈ సినిమాను పోస్ట్ చేయకు తప్పలేదని తెలుస్తుంది. అసలే కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఇండస్ట్రీలో ఈ సినిమాను విడుదల చేసి మరింత భారం చేయకూడదు అని ఆయన ఇలా చేస్తున్నారట.  గతంలో బాహుబలి తో తాను క్రియేట్ చేసిన రికార్డులను తానే అధిగమించాల్సి ఉన్న పరిస్థితి లో ఈ సినిమా ఎలాంటి పోటీ లేకుండా విడుదల చేసి భారీ కలెక్షన్లు సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: