పవన్ కళ్యాణ్ రానా లు కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా ఈమూవీ స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ హస్తం కూడ పడటంతో ఈ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ ప్రచారం మొదలైంది. సంక్రాంతి రేస్ ను టార్గెట్ చేస్తూ జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పవన్ నటవిశ్వరూపం ఉంటుంది అన్నప్రచారం జరుగుతోంది.


ఈమూవీకి సంబంధించి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ఒక న్యూస్ షాకింగ్ గా మారింది. ఈ మూవీని ధియేటర్లలో విడుదల చేయకుండా ఈమూవీ రైట్స్ డైరెక్ట్ గా తమకు ఇస్తే 150 కోట్లు ఇస్తామని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఈమూవీ నిర్మాతలకు భారీ ఆఫర్ ఇచ్చింది అంటూ జరుగుతున్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.


పవన్ కళ్యాణ్ కు ఒక్క తెలుగు రాష్ట్రాలలో మినహా మిగతా రాష్ట్రాలలో పెద్దగా ఇమేజ్ లేదు. అలాంటి హీరో నటించిన ఒక సినిమాకు ఇంత భారీ ఆఫర్ అమెజాన్ ఎందుకు ఇస్తుంది అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనికితోడు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఇప్పటికీ పూర్తిగా ఓటీటీ సినిమాలకు అలవాటు పడలేడు. దీనితో అమెజాన్ సభ్యత్వాలు గల చందాదారుల సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు తక్కువగా ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో అమెజాన్ తన చందా దారుల సంఖ్యను పెంచుకోవాలి అంటే ఒక భారీ సినిమా డైరెక్ట్ రిలీజ్ కు వారి చేతిలో ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు అమెజాన్ ఇలాంటి భారీ ఆఫర్ ఇచ్చిండా లేకుంటే ఈ మూవీ మార్కెట్ ను బయ్యర్లలో పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా ఈమూవీ నిర్మాతలు ఇలాంటి లీకులు ఇస్తూ ఈమూవీ మ్యానియాను పెంచుతున్నారా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: