నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీగా వసూళ్లను దక్కించుకుంటుందని తెలుస్తుంది.. రెండు రోజుల్లో ఏకంగా 5.5 లక్షల డాలర్ల వసూళ్లను నమోదు చేసిన సంగతి తెల్సిందే. లాంగ్‌ రన్‌ లో మరో మిలియన్ డాలర్ల వసూళ్లను ఈ సినిమా దక్కించుకోవడం పక్కా అంటూ అంతా నమ్మకంగా ఉన్నారట.

ఈ సమయంలో బాలయ్య తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లకు ఏమాత్రం తగ్గకుండా కర్ణాటకలో వస్తున్న వసూళ్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని తెలుస్తుంది.. అక్కడ లాంగ్‌ రన్ లో కోటి రూపాయల వసూళ్లు నమోదు అయితే చాలా పెద్ద విజయం అన్నట్లుగా పరిగణించాలని సమాచారం.కేవలం రాజమౌళి సినిమాలు లేదా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే అక్కడ రెండు మూడు కోట్ల వసూళ్లు దక్కించుకుంటాయని కాని అఖండ సినిమా కర్ణాటకలో ఏకంగా రెండున్నర కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసిందని తెలుస్తుంది.

రెండవ రోజు 80 లక్షల వసూళ్లు దక్కించుకోగా వీకెండ్‌ లో మళ్లీ కలెక్షన్స్ పుంజుకుంటాయని అంటున్నారని తెలుస్తుంది... కేవలం కర్ణాటకలోనే లాంగ్‌ రన్ లో అఖండ సినిమా అఖండమైన వసూళ్లను అంటే 5 కోట్ల నుండి 6 కోట్ల రూపాయల వరకు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం శని ఆదివారాల్లో నమోదు అవ్వబోతున్న వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టం గా ఉందంటూ అభిమానులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని వార్త వినిపిస్తుంది..

ఖచ్చితంగా ఈ సినిమా మంచి వసూళ్లను అక్కడ ఇక్కడ అన్ని చోట్ల నమోదు చేస్తుందని అంతా ఆశిస్తున్నారని సమాచారం.. బోయపాటి బాలయ్య ల కాంబోలో వచ్చిన ఈ మూడవ సినిమా హ్యాట్రిక్ ను దక్కించుకుందని తెలుస్తుంది.ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో శ్రీకాంత్‌ విలన్ గా నటించాడట.ఈ సినిమా బాలయ్య కెరీర్ లో ఆల్‌ టైమ్ రికార్డు ను దక్కించుకోబోతున్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: