తమిళ అగ్ర హీరో ధనుష్, ఐశ్వర్యలు తమ వైవాహిక బంధానికి ఇటీవలే వీడ్కోలు పలికి అందరినీ షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. దాదాపు 18 ఏళ్ళు కలిసి జీవించిన వీరిద్దరూ జనవరి 17న విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక వీరిద్దరూ విడిపోయారనే వార్త అభిమానులే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఎంతగానో కలచివేస్తోంది. ముఖ్యంగా ఈ విషయాన్ని ఐశ్వర్య తండ్రి సూపర్ స్టార్ రజినీకాంత్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన కూతురు, అల్లుడు విడిపోదామని డిసైడ్ అయినప్పటి నుంచి రజనీకాంత్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి.

తన కూతురు జీవితాన్ని చక్కబెట్టాలని రజనీకాంత్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారట. అయితే ఇదే విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్ సుభాష్ కె ఝా ఓ జాతీయ మీడియా కథనంలో తెలియజేసస్తూ..' రజనీ సార్ కూతురు ఐశ్వర్య, ధనుష్ విడిపోవడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ధనుష్, ఐశ్వర్యల విడాకులు తాత్కాలికమని రజినీకాంత్ గారు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని తన కూతురు పై ఆయన ఒత్తిడి చేస్తున్నారు' అని తెలిపారు. నిజానికి ధనుష్ ఐశ్వర్య మధ్య విభేదాలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ వాటిని పరిష్కరించి ఇద్దరిని ఒక్కటి చేసేవారట.

అయితే ఈసారి గొడవ తీవ్రస్థాయిలో రావడంతో వారిద్దరూ వాటిని పరిష్కరించడానికి బదులుగా..విడిపోవాలని డిసైడ్ అవ్వడంతో రజనీకాంత్ ప్రస్తుతం లోలోపలే కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ధనుష్ ఐశ్వర్య మధ్య విభేదాలను రజినీకాంత్ పరిష్కరిస్తారని చాలామంది భావిస్తున్నారు. అంతేకాదు ధనుష్ ఐశ్వర్య ను మళ్ళీ కలుస్తారని రజనీకాంత్ ఫ్యామిలీ చాలా బలంగా నమ్ముతోంది. మరోవైపు ఇన్నాళ్లు కలిసి ఉన్న ఈ జంట ఆకస్మాత్తుగా విడిపోవడానికి ఇవే కారణాలు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా సుచీ లీక్స్ ఉదంతం కూడా ఓ కారణమని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: