సినిమా ఫీల్డ్ లోకి అడుగుపెట్టే మన హీరోయిన్స్ లో చాలా మంది తమ మొదటి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకుని సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఇది ఇలా ఉండగా మరి కొంత మంది హీరోయిన్స్ మాత్రం తమ మొదటి సినిమా అంతగా రాణించకపోయినా అందులో వారు కనబరిచిన నటనకు కూడా తమకు ప్రేక్షకులలో మంచి ఆదరాభిమానాలను పొందుతుంటారు. ఇలాంటి వాళ్ళలో ఒకరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు మొదటగా నటించిన సినిమా "పెళ్లి సందడి". ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ నటించగా హీరోయిన్ క్యారెక్టర్ లో శ్రీలీల నటించారు.

అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేసినా కథలో దమ్ము లేకపోవడం వలన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ లో నటించిన శ్రీలీల మాత్రం తన నటనతో, అందాలతో మన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిందనే చెప్పుకోవాలి. మరి ఇంతగా ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ ముద్దుగుమ్మ నటనకు మన డైరెక్టర్స్ కూడా ఫిదా అయిపోవాల్సిందే. తన అందచందాలతో తన నటనతో ఇందరి మనసు గెలిచిన ఈ అమ్మడు ఇప్పటికే "ధమాకా"తో ఎంట్రీ ఇవ్వనుంది అని తెలిసిందే. ఇందులో రవితేజ హీరోగా చేస్తున్నాడు. కాగా ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సారి ఒక కొత్త క్యారక్టర్ లో శ్రీలీల కనిపించనుంది అని తెలుస్తోంది. డైరెక్టర్ తేజ కొత్తగా తెరకెక్కిస్తున్న విక్రమాదిత్య సినిమాలో ఒక ప్రధాన పాత్రకు శ్రీలీలను ఎంపిక అయిందట. సరికొత్త కథలను ఎంచుకునే తేజ ఈ సారి ఎలాంటి కథను మన ముందుకు తీసుకురానున్నారో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో శ్రీలీల పాత్రపై ఇంకా క్లారిటీ లేదు. ఈ పాత్ర కు సంబంధించిన పూర్తి వివరాలు తర్వలోనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: