రష్మిక. కు ప్రస్తుతం పుష్ప టీమ్ గట్టి షాక్ ఇవ్వబోతుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తను లైన్ లో ఉండగానే మరొక హీరోయిన్ ని ఈ చిత్రం లో కి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అనే వార్తలు టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనం చెప్పనవసరం లేదు. విమర్శకులకు కూడా చెక్ పెట్టాడు రామ్ చరణ్. ఇక ఇందులో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు.

ప్రస్తుతం పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. బన్నీ డీ గ్లామరస్ క్యారెక్టర్ కావడంతో ఆ క్యారెక్టర్ కి ఒక సపరేటు మేనరిజం ఉందని చెప్పవచ్చు. అందుచేతనే ముందు నుండే ఈ సినిమా ప్లానింగ్ పక్కగా జరుగుతోందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే పాన్ ఇండియా చిత్రంగా మొదలుపెట్టలేదు. కానీ ఆ తర్వాత విడుదల సమయంలో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయాలని చూశారు. దీంతో అలా విడుదల చేయగా.. ఈ మూవీ రికార్డులను సైతం తిరగరాసింది. బాలీవుడ్ లో ఈ చిత్రం సాధించిన వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఈ సినిమా పార్ట్ 2 ను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొదలుపెట్టాలి అనుకున్నారు. కానీ ఇటీవల పాన్ ఇండియా చిత్రాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్న తీరును బట్టి సుకుమార్ గత కొన్ని రోజులుగా పుష్ప -2 స్క్రిప్టులో భారీగా మార్పులు చేసినట్లుగా సమాచారం. పుష్ప పార్ట్-1 మించి ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే పార్ట్-2 లో మాత్రం పెళ్లి తర్వాత హీరోహీరోయిన్ల మధ్య ఎక్కువ సీన్లు ఉండే విధంగా స్క్రిప్టుని రాయ లేదట. ఇక అందుచేతనే ఇందులో సెకండ్ హీరోయిన్ ని రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేశారు సుకుమార్. ప్రస్తుతం ఎవరా సెకండ్ హీరోయిన్ అన్నది ఇంకా తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: