టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో అదిరిపోయే బ్లాక్బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు.

 ఇలా అతి తక్కువ కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో చివరగా ప్రేక్షకులను పలకరించాడు. కాకపోతే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. లైగర్ మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ , సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

 ఈ సినిమాకు ప్రేమకథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమాలో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టిన విజయ్ దేవరకొండ , ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఇంద్రగంటి మోహన కృష్ణ,  విజయ్ దేవరకొండ కు ఒక కథ చెప్పడం, ఆ కథకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: