అఖిల్ హీరోగా ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెం ట్ అనే సినిమా తెరకెక్కుతుంది. తొలి మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించలేకపోయిన అఖిల్ తన నాలుగవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో తొలి విజయా న్ని అందుకున్నాడు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అఖిల్ నటిస్తున్న తదుపరి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. తొలి విజయం తర్వాత ఆయనకు ఓ కొత్త రకమైన అనుభవం ఎదురవుతుంది అని చెప్పాలి.

ఇప్పటిదాకా అఖిల్ పెద్ద దర్శకులతో సినిమాలు చేసింది లేదు. ఈ నేపథ్యం లోనే ఇప్పుడు సురేందర్ రెడ్డి లాంటి అగ్ర దర్శకుడితో ఆయన సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అంచనాలను భారీగానే పెంచాయి దానికితోడు అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించిన హడావుడి చేస్తూ ఉండటం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అవుతుంది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న ట్లుగా గతంలో ప్రకటించారు.

అయితే అఖిల్ తదుపరి చేయబోయే సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాక పోవడం అక్కినేని అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది దానికి కారణం లేకపోలేదు ఇతర హీరోలు సినిమాలు సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు పోతుంటే ఒక్క సినిమా తో ఉండడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ నుండి కూడా ఆయన తదుపరి సినిమాలు ఎవరితో చేస్తున్నాడు అని క్లారిటీ ఇవ్వకపోవడం ఒక్కసారిగా వారిని నిరాశపరుస్తుంది. మరి త్వరలోనే అఖిల్ చేయబోయే తన తదుపరి సినిమా యొక్క ప్రకటనను చేస్తాడా అనేది చూడాలి. కొంతమంది యాక్టర్ దర్శకులతో అని ఆయన తన తదుపరి సినిమాలు చేస్తాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: