మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలిసిందే.తాజాగా ఈయన నటించిన #RRR సినిమాతో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు గత కొన్ని రోజులుగా చరణ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.కాగా  విక్రమ్ సక్సెస్ తర్వాత దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ రేంజ్ పెరిగింది.ఇకపోతే టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలపై లోకేశ్ కనగరాజ్ దృష్టి పెడితే లోకేశ్ రేంజ్ పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 అయితే విక్రమ్ సినిమా విడుదలై రెండు వారాలు దాటినా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.ఇదిలావుంటే  తాజాగా విక్రమ్ ప్రమోషన్లలో భాగంగా లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి నేను చరణ్ సార్ టచ్ లో ఉన్నామని అన్నారు.ఇకపోతే ఫోన్ కాల్స్ ద్వారా తరచూ మాట్లాడుకుంటామని ఈ పరిచయం ఇప్పటిది కాదని లోకేశ్ కామెంట్లు చేశారు. అయితే చరణ్ కు ఎప్పుడైనా ఫోన్ కాల్ చేసేంత క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉందని ఆయనకు నేను రెండు కథలను చెప్పానని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తమ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని లోకేశ్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

కాగా చరణ్ తో తనకు కంఫర్ట్ ఉంటుందని విక్రమ్ ఈవెంట్ సమయంలో చిరంజీవి గారు డిన్నర్ కు పిలిచారని డిన్నర్ కు సల్మాన్ గారు కూడా వస్తారని తెలిసి తాను ఒకింత కంగారు పడ్డానని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు డిన్నర్ సమయంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చర్చ జరిగిందని లోకేశ్ కనగరాజ్ తెలిపారు.ఇదిలావుండగా చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా చరణ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమాలో సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.ఇకపోతే  ఈ సినిమాలు పూర్తైతే మాత్రమే చరణ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.ఇక  చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కనున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: