నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా అఖండ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు .

ఈ సినిమాకి ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో  107 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమా ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూండగా, తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా,  ఈ టీజర్ లో బాలకృష్ణ తన పవర్ఫుల్ మాస్ డైలాగ్ లతో ,  మాస్ మేనరిజం తో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మాస్ యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నాయి  అని తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా ఫస్ట్ హాఫ్ లో రెండు అదిరిపోయే లోకల్ యాక్షన్ సన్నివేశాలు, అలాగే ఒక ఫారిన్ ఫైట్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  అలానే మూవీ  సెకండ్ హాఫ్ లో మరింతగా ఆకట్టుకునే భారీ యాక్షన్ మరియు  అదిరిపోయే ఫైట్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: