తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కరోనా సమయంలో కూడా ఎంతోమంది నటీనటులను కోల్పోయాము. మరి కొంతమంది కొన్ని అనారోగ్య సమస్యల వల్ల మరణించారు. ఇప్పుడు తాజాగా మరొక విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. ఆయన ఎవరో కాదు ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూయడం జరిగింది అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


అసలు విషయంలోకి వెళితే ఈయన ఎడిటర్ గా ఎన్నో సినిమాలకు పనిచేశారు కానీ గత కొన్ని రోజులుగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడట. కాని చివరికి ఆ బాధల నుండి కోలుకోలేక తుది శ్వాస విడిచడం జరిగింది. దాదాపుగా గౌతమ్ రాజు 800 కు పైగా చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు కేవలం ఈ ఘనత ఈయనకి ఒక్కటే సొంతం అయ్యింది అన్నట్లు తెలుస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ వంటి భాషలలో కూడా ఈయన పనిచేశారు. చిరంజీవికి ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, గోపాల గోపాల, వంటి సినిమాలు చేశారు. ఇక ఇదే కాకుండా అదుర్స్ రేసుగుర్రం బద్రీనాథ్ డాన్ శీను, తదితర సినిమాలకు కూడా ఈయన ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహించారు.


ప్రస్తుతం ఈయన వయసు 68 సంవత్సరాలు . అయితే ఇంకా ఈయన మరణానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియపరచలేదు. ఈయన మరణంతో ఇండస్ట్రీ ఒకసారిగా శోకసముద్రంలోకి వెళ్లిపోయింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఈయన మరణ వార్త విని దిగ్బ్రాంతికి గురయ్యారు. పలువురు నెటిజెన్లు మాత్రం ఈయనకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో వరుసగా ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రిందట హీరోయిన్ మీనా భర్త మరణ వార్త మానక ముందే.. ఇప్పుడు ఈ వార్త కలిచీ వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: