మెగాస్టార్ చిరంజీవి ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన 'ఆచార్య' సినిమా రెండేళ్లకు పైగా నిర్మాణం జరుపుకుంది. కరోనా పాండమిక్ కారణంగా బడ్జెట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఈ మూవీ కోసం ఎవరూ కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని మేకర్స్ ముందు నుంచీ చెబుతూ వచ్చారు.ఇక కాంబినేషన్ మీదున్న క్రేజ్ తో 'ఆచార్య' సినిమాని బయ్యర్లు భారీ రేట్లకే కొన్నారు. పైగా ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా కొరటాల శివే డీల్ చేశాడనే టాక్ ఉంది. ఏప్రిల్ 29 వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ మెగా మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు అన్ని ఏరియాలలో కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా ఎగ్జిబిటర్స్ చాలా తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఇక వారికి సెటిల్మెంట్ చేయాల్సి వచ్చింది.'ఆచార్య' సినిమా మార్కెటింగ్ అంతా కొరటాల చేతుల మీదుగా జరగడంతో.. నష్టపోయిన వారంతా కూడా దర్శకుడినే ఆశ్రయించారు.అయితే ఆంధ్రాలో తన సన్నిహితులకే సినిమా ఇవ్వడంతో ఇబ్బంది లేదు కానీ.. మిగతా ఏరియాల్లో మాత్రం ఇంకా సెటిల్ చేయాల్సి వచ్చింది.


వీరంతా కూడా ఇప్పుడు శివ పై ఒత్తిడి తీసుకొస్తున్నారని వినికిడి.ఇప్పటికే చిరు ఇంకా చరణ్ తమ వంతుగా రూ. 20 కోట్లకు పైగా చెల్లింపులు చేశారని ప్రచారం జరుగుతోంది. అయినా సరే ఈ నష్టాలను పూడ్చడానికి ఇది సరిపోదు. ఈ నేపథ్యంలో ఇక కొరటాల శివ మిగతా నష్టపరిహారం చెల్లించడానికి రెడీ అయ్యారని.. దీని కోసం దర్శకుడు హైదరాబాద్ లోని ఒక ప్రధాన ఏరియాలోని ప్లాట్ ను కూడా అమ్మకానికి పెట్టాడని అనేక రకాల రూమర్లు వినిపిస్తున్నాయి.ఇక దీన్ని విక్రయించడం ద్వారా రూ. 40 నుండి 45 కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని.. దాంతో 'ఆచార్య' సినిమా బయ్యర్లకు పరిహారం చెల్లించాలని కొరటాల శివ యోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ అనేది నడుస్తోంది. ఇందులో అసలు నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: