గత కొంత కాలంగా నాని కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే విడుదలైన ‘అంటే సుందరానికీ’ చిత్రం కూడా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా మిగిలింది.ఇక ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ కథలను ఎంచుకోవడంలో నాని మొదటి స్థానంలో ఉంటాడు.అయితే  ఈయన కెరీర్‌లో ఇప్పటివరకు తీసినవన్ని ఒకదానికొకటి సంబంధంలేకుండా విభిన్నంగా ఉంటాయి. అయితే ఇక  ఈయన సినిమాలను ప్రేక్షకులు ఆధరిస్తున్నకమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోతున్నాయి.

ఇకపోతే బీ నాని గత ఐదారు చిత్రాలు కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయాయి.ఇక  నిజానికి చెప్పాలంటే ‘ఎమ్‌సీఏ’ తర్వాత నాని కెరీర్ ఆ స్థాయిలో ఇప్పటివరకు మరో హిట్టు లేదు. ఇకపోతేఈ క్రమంలోనే నాని ఈ సారి ‘దసరా’ సినిమాతో అవుట్ అండ్ అవుట్ మాస్ కథతో కమర్షియల్ హిట్టు కొట్టడానికి ముస్తాబవుతున్నాడు.ఇదిలావుంటే ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.ఇక  ఈ చిత్రం ఇప్పటివరకు 30శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట.

అంతే కాదు అన్ని కుదరితే డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని చిత్రం బృందం ప్లాన్ చేస్తుందట. ఇదిలావుంటే ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుందట. అంతేకాకుండా ఈ చిత్రం క్వాలిటీ కోసం నాని తన పారితోషికాన్ని కూడా దగ్గించకున్నాడని టాక్‌. ఇక కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. పోతే ఈ చిత్రంలో నాని,కీర్తి డీ గ్లామర్ పాత్రను పోషించారు.కాగా  ఇటీవలే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది.అంతేకాదు  ఈ చిత్రం తెలంగాణ లోని గ్రామిణ నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తుంది.ఇక రీసెంట్ గా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది సినిమా యూనిట్. తాజాగా ఈ సినిమా కోసం ఏకంగా ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ భారీ సెట్ ను నిర్మించారు. ఇది ఓ పల్లెటూరు సెట్ అని తెలుస్తోంది . ఈ సెట్లోనే సుమారు 20 రోజులపాటు చిత్ర యూనిట్ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక నాని సినిమాకు ఈ రేంజ్ బడ్జెట్లో సెట్ వేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: