టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోల చేతులలో ఒకటికి రెండు సినిమాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మన హీరోలు ఇన్ని సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఏడాదికి ఒక సినిమా చేయడమే గగన మైపోయిన రోజుల నుంచి ఏడాదికి రెండు మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం ఓ ఇద్దరు ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోలు చేతిలో అన్ని సినిమాలు పెట్టుకుని కూడా ఇంట్లో ఖాళీగా నెలల తరబడి కూర్చోవడం వారి అభిమానులను ఏమాత్రం అలరించడం లేదు.

అలాంటి హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో ఎన్టీఆర్. తన తదుపరి సినిమాను ఇంకా మొదలు పెట్టకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో ఆగ్రహ పరుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా యొక్క అధికారిక ప్రకటన రాగా ఎంతకీ ఆ సినిమాను మొదలు పెట్టకపోవడం అభిమానులలో అసహనాన్ని రేకెత్తిస్తుంది.

ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప లాంటి భారీ విజయాన్ని అందుకోగా ఆ సినిమా తో బన్నీ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయినా కూడా ఆయన ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని మొదలు పెట్టడానికి ఇన్ని నెలల సమయాన్ని తీసుకోవడం నిజంగా బన్నీ అభిమానులను ఎంతగానో నిరుత్సాహపరుస్తుంది. ఆ విధంగా సుకుమార్ పుష్ప రెండవ భాగం సినిమా కోసం ఇంత సమయాన్ని తీసుకోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభాస్ చేతిలో కూడా పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్ చిత్రం యొక్క షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా ఆ తరువాత చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశాడు. అయితే సలార్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడం ప్రభాస్ అభిమానులను నిరాశ పరుస్తుంది. ప్రశాంత్ ఇప్పుడు సలార్ సినిమా యొక్క స్క్రిప్ట్ పనులను తీర్చిదిద్దుతున్న కారణంగానే ఈ సినిమా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: