నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ రెండవ భాగం సినిమా ఈ నెల 13వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఎన్నో గందరగోళాల మధ్య మరెన్నో అనుమానాల మధ్య ఈ సినిమాను ఈ శనివారం విడుదల చేయడానికి సిద్ధమవుతుంది చిత్ర బృందం. కారణమేదైనా కూడా కార్తికేయ2 సినిమాకు ఇంత ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి. మంచి హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నిఖిల్ విడుదల విషయంలో ఇంతగా ఇబ్బందులు పడడం నిజంగా అందరూ చర్చించదగ్గ విషయం అనే చెప్పాలి.

ఇండస్ట్రీలో కొద్దో గొప్ప పేరు ఉన్న హీరోకి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారందరినీ ఎదిరించి ఈ సినిమాను విడుదల చేస్తున్న నిఖిల్ ఏ విధమైన విజయాన్ని అందుకుంటాడో చూడాలి. అయితే ఇప్పటిదాకా వచ్చిన ఇబ్బందులు చాలవన్నట్లు నిఖిల్ కు కొత్త ఇబ్బందులు ఎదురవబోతున్నాయట. ఈ సినిమాకు థియేటర్లు రాకపోవడం నిజంగా సినిమాను ఎంతగానో నిరాశపరిచే విషయమే. ఒక మంచి సినిమాను ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకొక వైపు మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల ఉండడంతో ఆ సినిమాకు ఎక్కువ థియేటర్లను ఇచ్చి ఈ సినిమాను తక్కువ థియేటర్లలో విడుదల అయ్యే విధంగా చేస్తున్నారట. మరి ఈ వ్యవహారం ఎంతకీ దారితీస్తుందో చూడాలి. సినిమా బాగుంటే కనుక కార్తికేయ 2 సినిమాకు మరిన్ని థియేటర్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అనుపమ పరమేశ్వరున్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం అందిస్తున్నాడు. డివోషనల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ మరొక ప్రేమకథా సినిమా ను చేస్తున్నాడు. సుకుమార్ నిర్మాణం లో 18 పేజెస్ అనే సినిమా ను చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: