గుండె జబ్బుల కు సంబంధించిన సమస్యలు రోజురోజు కీ పెరుగుతున్నాయి. దురదృష్టక రమైన విషయ మే మిటంటే వృద్ధు ల్లోనే కాకుండా యువత లో గుండె సమస్యలు ఎక్కువగా కనిపి స్తున్నాయి.
తాజా గా ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ (58) గుండెపోటు తో తుదిశ్వాస విడిచారు. హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ కు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఆయన గత నెలలో తీవ్ర గుండెపోటు తో ఆస్పత్రి లో చేరారు. అయితే కోలుకో లేక బుధవారం (సెప్టెంబర్‌ 21) కన్ను మూశారు. కాగా శ్రీవాస్తవ ఒక్కరే కాదు.. గతం లో చాలా మంది స్టార్స్ గుండె పోటు బారిన పడ్డారు. అనూహ్యం గా మనల్ని విడిచి వెళ్లి పోయారు.

సింగర్‌ కెకె

బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ గాయకుడు కెకె ఈ ఏడాది మే 31న కోల్‌కతా లో సంగీత కచేరీ చేస్తుండ గానే గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తర లించే లోపే కన్ను మూశాడు. ఆయన వయసు కేవలం 53 ఏళ్లు మాత్రమే.

సిద్ధార్థ్ శుక్లా

రియాలిటీ షో బిగ్ బాస్ అలాగే టీవీ సీరియల్స్‌ తో హిందీ చిత్ర పరిశ్రమలో తన దైన ముద్ర వేశారు సిద్ధార్థ్ శుక్లా. గతేడాది సెప్టెంబర్‌లో అతను గుండెపోటు తో మరణించారు. అతని వయసు కేవలం 40 ఏళ్లు మాత్రమే.

పునీత్ రాజ్ కుమార్

సౌత్ లెజెండరీ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్‌లో గుండె పోటు తో మరణించారు. అతని వయస్సు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే. ఆశ్చర్య కరమైన విషయమే మిటంటే.. జిమ్ చేస్తున్న సమయం లో ఆయన కూడా గుండె పోటు బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
మిథిలేష్ చతుర్వేది

మిథిలేష్ చతుర్వేది

ప్రముఖ నటుడు మిథిలేష్ చతుర్వేది (67) ఈ ఏడాది ఆగస్టు 3న మరణించాడు. గుండెపోటు కారణం గానే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరిం చారు

మరింత సమాచారం తెలుసుకోండి: