బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతి ముత్యం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది ఈ మూవీ లో వర్ష బో ,  బెల్లంకొండ గణేష్ సరసన హీరోయిన్ గా నటించింది. లక్ష్మణ్ కే కృష్ణమూవీ కి దర్శకత్వం వహించగా ,  హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఈ మూవీ ని సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించింది. చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా పరవాలేదు అనే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం స్వాతి ముత్యం మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగబోతోంది  ఈ మూవీ కనుక బాక్సా ఫీస్ దగ్గర 4 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్  స్టేటస్ ని అందుకుంటుంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో ,  ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: