ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు జడ్జిమెంట్ సినిమాల విషయంలో మెజారిటీ సందర్భాలలో నిజమవుతుందనే సంగతి తెలిసిందే. నైజాంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కలిగి ఉన్న దిల్ రాజు ఏ సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తే లాభాలు వస్తాయో కచ్చితంగా అంచనా వేయగలరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
తాజాగా నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ప్రతి సినిమాకు ఏ సినిమాకు అయినా తొలిరోజు నెగిటివ్ వైబ్స్ సాధారణం అని అన్నారు. ఆదిపురుష్ 3డీ టీజర్ ప్రత్యేక ప్రదర్శనలో దిల్ రాజు మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. ఆదిపురుష్ టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూశానని దిల్ రాజు అన్నారు. టీజర్ వచ్చిన వెంటనే మొబైల్ లో టీజర్ ను చూశానని ప్రభాస్ కు ఫోన్ చేస్తే స్విఛాఫ్ వచ్చిందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత అమేజింగ్ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టానని దిల్ రాజు కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీజర్ రెస్పాన్స్ ను కనుక్కుందామని భావించి కొంతమందికి కాల్ చేయగా ట్రోల్ చేస్తున్నారని చెప్పారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. బాహుబలి1 తొలిసారి చూసిన సమయంలో అందరూ ట్రోల్ చేశారని దిల్ రాజు కామెంట్లు చేశారు. శివలింగంను ఎత్తుకుని ప్రభాస్ వచ్చే ఫోటోలకు కొంతమంది జండూబామ్ ఫోటోలను పెట్టరని దిల్ రాజు అన్నారు.
సినిమా సూపర్ హిట్ అని ప్రభాస్ కు అప్పుడే చెప్పానని దిల్ రాజు కామెంట్లు చేశారు. ఆదిపురుష్ సినిమాను థియేటర్ లోనే చూడాలని మొబైల్ లో టీజర్ చూసి ఈ సినిమా రిజల్ట్ ను అంచనా వేయవద్దని దిల్ రాజు చెప్పుకొచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలను థియేటర్లలో పూర్తి జనాలతో చూస్తే అర్థమవుతుందని దిల్ రాజు కామెంట్లు చేశారు. ఆదిపురుష్ కూడా అలాంటి సినిమానే అని ఈ సినిమాను 3డీ విజువల్స్ లో చూస్తే బాగుంటుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: