
అయితే ఒకవేళ మోహన్ లాల్ వెర్షన్ అన్ని భాషల్లో చేసే పని అయితే వెంకటేష్ , అజయ్ దేవగన్ కు ఒక మంచి ఛాన్స్ మిస్ అయినట్టే .. కానీ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు .. ఎందుకంటే దృశ్యం అనగానే వెంకటేష్ తప్ప వేరే ఆప్షన్ అంటే మన ప్రేక్షకులు అంగీకరించకపోవచ్చు .. అంతగా రాంబాబు బ్రాండ్ ఆయన నటనతో ప్రేక్షకలో ముద్రించక పోయింది .. అలాంటప్పుడు కొత్తగా మోహన్ లాల్ వచ్చి దృశ్యం 3లో కనిపిస్తే బిజినెస్ పరంగా కూడా రిస్క్ అవుతుంది .. బాలీవుడ్ మరో ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇప్పటికే అజయ్ దేవగన్ మూడో భాగం కోసం వేరే కథను రెడీ చేసుకున్నారట .. డైరెక్టర్ ఎవరనేది ప్రస్తుతానికి ఇంకా కన్ఫామ్ చేయలేదని బాలీవుడ్ టాక్ ..
అయితే వీళ్ళిద్దరి విషయం ఇలా ఉన్న వెంకటేష్ మాత్రం దృశ్యం 3 ప్రతిపాదన వస్తే చేద్దాం లేదంటే లైట్ తీసుకుందామనే తరహాలో ఉన్నట్టు తెలుస్తుంది .. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ మామ ఆచితూచి అడుగులు వేస్తున్న వెంకటేష్ కు మూడో భాగం కి సంబంధించిన ప్రతిపాదనలు రాలేదని తెలిసింది .. ఇక దృశ్యం 2 తెలుగులో కూడా జీతూ జోసెఫ్ చేసినప్పటికీ దాని కొనసాగింపు గురించి ఇద్దరి మధ్య చర్చలు లాంటివి జరగలేదట . ఇంత తక్కువ బడ్జెట్ లో సీక్వెల్ మీద క్రేజ్ వచ్చేలా చేసుకున్న ఒకే ఒక్క సినిమాగా దృశ్యం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది .. ఇక మరి వెంకటేష్ ని మరోసారి ఈ సినిమాల్లో చూడడం జరుగుతుందా లేక మిస్ అవుతుందా అనేది మరి కొద్ది రోజుల్లోనే బయటికి రావచ్చు..