
కొన్ని ఏరియాలలో సైతం హిట్3 సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. అయితే ఆ ఏరియాలలో ఈ సినిమా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది హిట్3 సినిమా ఇతర భాషల్లో సైతం సంచలన విజయం సాధించాలని ఫ్యాన్స్ భావించినా అక్కడ ఆశాజనకంగా పరిస్థితులు అయితే లేవు. హిట్3 సినిమా నాని కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అయితే అందించిందని చెప్పవచ్చు.
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా సైతం అభిరుచిని చాటుకుంటున్నారు. ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. నాని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాని రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో పెరుగుతోంది. రాబోయే రోజుల్లో నాని పారితోషికం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.
ఏ పాత్రలో నటించినా నాని ఆ పాత్రకు న్యాయం చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో మాస్ సినిమాలలో నటించిన మెజారిటీ సందర్భాల్లో భారీ షాకులు తగలగా నాని కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. నాని లుక్స్ విషయ్లో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా సినిమాకు నాని వేరియేషన్ చూపిస్తుండటం గమనార్హం. నాని భవిష్యత్తులో పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి.