
నిఖిల్ తన పోస్ట్ లో ఇంకా ఎవరైనా తుర్కియే వెళ్లాలని అనుకుంటున్నారా అంటూ కామెంట్లు చేశారు. దయచేసి ఒక్కసారి ఈ పోస్ట్ చూడాలని నిఖిల్ పేర్కొన్నరు. ప్రతి సంవత్సరం తుర్కియేలో పెద్ద మొత్తం ఖర్చు పెడుతుంటారని మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ల కోసం డబ్బు ఖర్చు పెట్టడం దయచేసి మానాలని చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్ కు తుర్కియే అనుకూలంగా వ్యవహరించిన నేపథ్యంలో భారత్ నుంచి ఆ దేశానికి అనుకూలంగా ఉండకూడదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం బాయ్ కాట్ తుర్కియే పేరుతో విసృత ప్రచారం సాగుతుండటం గమనార్హం. మరోవైపు నిఖిల్ తర్వాత సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్వయంభూ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటం గమనార్హం.
స్వయంభూ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్వయంభూ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిఖిల్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుండటం గమనార్హం. నిఖిల్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. నిఖిల్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నయో చూడాల్సి ఉంది. నిఖిల్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.