ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. అందులో కొన్ని సినిమాలు సక్సెస్ కాగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఎన్టీఆర్ నటనకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు తన అభిమానులు తెగ సందడి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఈ సినిమాకు సీక్వెల్ గా దేవర-2 సినిమాను కూడా త్వరలోనే తీయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కాగా, ఎన్టీఆర్ త్వరలోనే దర్శకుడు రాజమౌళి ప్రొడక్షన్ లో భారతీయ చలనచిత్ర పితామహుడు "దాదాసాహెబ్ ఫాల్కే" బయోపిక్ లో నటించనున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారట.

దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు దర్శకుడు రాజమౌళితో పాటు ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ కార్తికేయ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాసాహెబ్ పాత్రలో ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఏఐ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి.


ఈ ఫోటోలపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో అని కొంతమంది అంటున్నారు. ఈ ఫోటోలు చూసి అనంతరం ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఫోటోలు చూసిన చాలామంది అభిమానులు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రకు ఎన్టీఆర్ చాలా బాగా సెట్ అయ్యాడని కామెంట్లు చేస్తున్నారు. తొందరగా సినిమా షూటింగ్ ప్రారంభించి అభిమానులకు అప్పగించాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: